పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

497 దిక్కుల నిది చాలక దివ్యభోగముగోర అక్కర నా కొక ఆసాదమా చ. పాతకాలు సేసేటి పరుల బంటుఁ జేయక యీతల నీ బంటుఁ జేసి తిది చాలదా ఆతల నీవద్ది సనకాదుల పదవి గోర ఆతుమలో నా కొక ఆసాశీదమూ చ. నరక మనుభవించ నన్ను నందు నిలుపక యిరవై యిహ మిచ్చి తిది చాలదా ధర శ్రీ వేంకటపతి తగ నీకు శరణంటి పరము గోరను యింకా నప్పటి నాసోదమా పె.అ.రేకు:0048-03 రామక్రియ సంపుటము: 15-271 పల్లవి: కోరి నీ యీవికి దొడ్డఁ గొంచెము లేదు ధారుణిలో నీ సరి దాత్రలు వేరీ చ. వుత్తానపాదునికొడుకొగి నుతియించు టెంత బత్తితో నీ విచ్చు ధ్రువపట్టమెంతా హత్తి పిలువవచ్చిన యక్రూరుపని యెంత సత్తుగా నీ రూపు చూపి చన విచ్చు టెంతా చ. వొట్టి యంబరీషుడున్న వుపవాసమది యెంత అట్టె చక్రము రక్షగా నంపు టెంతా గుట్టునఁ గాముకులైన గోపికలు గూడు టెంత నెట్టన నిహపరాలు నీ విచ్చు టెంతా చ. తలఁచి గుహుఁడు వోడ దాఁటించినమాత్ర మెంత సులభాన నిండుఁ గృపఁజూచుట యెంతా బలిమి శ్రీవేంకటేశ పరుషలకా నీ కెంత వలసినట్టు నీ విచ్చు వరము లివి యెంతా రేకు:0117-05 మలహరి సంపుటము: 02-101 పల్లవి: కోరి మాభుజముల డాగులు మోచుకున్నారము ధారుణిలోపల మమ్ము దయఁజూచుఁ గాక చ. సతతము హరిచేతి శంఖచక్రములే గతియై మాపాలనుండి కాచుఁ గాక అతిరయమైనట్టిఅచ్యుతుని ఆయుధాలే హితవుగ మమ్ము నిట్టె యేలుఁ గాక చ. కమలాపతిచేతుల గదాపద్మములు మమకారముతో మము మన్నించుఁ గాక సమరవిజయమైన శార్ణాదిశరములు తమితోడ మాకు దాపుదండై వుండుఁ గాక చ. ముంచి శ్రీవేంకటేశుఁడు మొలఁగట్టిన కఠారు అంచెల మాకెల్ల రక్లై అమరుఁ గాక అంచ నీతని కైదువులమరిన హస్తములు పంచల మాకిట్టే వజ్రపంజరా లవుఁ గాక రేకు:0029-01 శ్రీరాగం సంపుటము: 01-176 పల్లవి: కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ జెడి వూరక యీమది నీపై నుండుట యెన్నఁడొకో చ. చిత్తం బాఁకలి దీరదు, చింత దలంపునఁ బాయదు యెత్తిన పరితాపమునకు నేదీ మితిమేర