పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

496 పట్టినది శ్రీహరిపాదపద్మ మూలము యెట్టయినా మాకు మేలే యిఁకనేల చింత చ. చిక్కి నా లోనైనది శ్రీవైష్ణవధర్మము తొక్కినది భవముల తుదిపదము యొక్కినది హరిభక్తి యిది పట్టపేనుఁగ యొక్కువ కెక్కువే కాక యిఁక నేల చింత చ. చిత్తములోనిండినది శ్రీపతిరూపము హత్తినది వైరాగ్య మాత్మధనము యెత్తలఁజూచిన మాకు నిదివో శ్రీవేంకటేశుఁడెత్తి మముఁ గావఁగాను యిఁక నేల చింత రేకు:0158-05 సామంతం సంపుటము: 02-280 పల్లవి: కోటిమన్మథాకార గోవింద కృష్ణ పాటించి నీమహిమలే పరబ్రహ్మము చ. అకాశమువంటి మేన నమలేమూర్తివి గాన అకాశనదియే నీకు నభిషేకము మేకొని నీవే నిండుమేఘవరుఁడవు గాన నీకు మేఘపుష్పాలే పన్నీరుకాపు చ. చంద్రుడు నీమనసులో జనించె నటుగాన చంద్రికలు కప్రకాపై సరి నిండెను ఇంద్రనీలపుగనుల యిలధరుఁబడవు గాన తంద్రలేని యీ పె చూపే తట్టు పునుఁగాయను చ. లక్షీపతివిగాన లాగుల నీవురముపై లక్షి యలమేలుమంగే లలి నీతాళి సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపాడవు గాఁగ పక్ష్మనక్షత్రములే యాభరణహారములు రేకు:0289-06 దేసాళం సంపుటము: 03-517 పల్లవి: కోనేటి దరులఁ గనుఁగొనరో మూఁడుదేరులు నానాదేవతలార నరులార మీరు చ. తెంకిగా ముందర నొక్క తేరెక్కె శ్రీకృష్ణుఁడు వేంకటేశుఁ డెక్కె నదె వేరొక్క తేరు లంకెలై శ్రీభూసతులు లలి నొక్క తేరెక్కిరి కొంకక వీధుల నడగొండలో యనఁగను చ. యిరవై శ్రీకృష్ణునిది యిదె వానరధ్వజము గరుడధ్వజము శ్రీవేంకటపతిది కరిలాంఛన ధ్వజము కమలకు మేదినికి అలరి చూపట్టెను బ్రహ్మాండాల వలెను చ. చెలఁగి చెఱకువిల్లు చేతఁబట్టె శ్రీకృష్ణుఁడు బలు శ్రీవేంకటేశుఁడు పట్టెఁ జక్రము అలమేలుమంగ భూమి యంబుజాలు చేఁబట్టిరి కలసి మెలసేరు బంగారుమేడ లనఁగ పె.అ.రేకు:0024-01 శంకరాభరణం సంపుటము: 15-135 పల్లవి: కోరి ధర్మము చాలు కుక్కఁబట్టు మన్నరీతి యీరీతి నింత సేసితి వింత చాలదా చ. చక్కగా నన్నొక హీనజంతువుఁగాఁ బుట్టించక యొక్కువ నరునిఁ జేసి తింత చాలదా