పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

495 వంతురక్షకత్వము కరుణ భువి నంతర్యామికి నది సహజము చ. కలకాలంబును గామముఁ గ్రోధము చలమును బ్రాణుల సహజము సులభత్వంబును సారిది వదాన్యత అల లక్షిపతికది సహజము చ. వుడుగనికర్మము లొడలోముటలును జడులము మాకిది సహజము యెడయక శ్రీవేంకటేశ నీకు మము నడరి కాచుటే అది సహజము పె.అ.రేకు:0075-04 లలిత సంపుటము: 15-432 పల్లవి: కొసరి నీతోఁ బెనఁగి గునిసి మోక్ష మడుగ వెస నీబంట నింతే నీవే దిక్కు నాకు చ. బలిమి నీ బిడ్డఁడైన బ్రహ్మంతవాఁడనా అల సముద్రుఁడు మామ యంత్ర వాఁడనా చలువైన నీ మఱఁది చంద్రునంతవాఁడనా యెలమి నీతోఁ బుట్టిన యింద్రునంతవాఁడనా చ. చనువున మీ తండ్రి కశ్యపునంతవాఁడనా అనుజుఁడైన లక్ష్మణునంతవాఁడనా మనవికి మీ బావ ధర్మజునంతవాఁడనా అనుఁగు దాతయైన భీష్మునంతవాఁడనా చ. మనికైన యల్లుఁ డభిమన్యునంతవాఁడనా అనిరుదుఁడు మనుము(డOత్రవాఁడనా ఘనుఁడ శ్రీవేంకటేశ కల్పించి నీ వాడించఁగా పనిపూని మెలఁగేటి పత్రిమను నేను రేకు:0156-04 దేసాక్షి సంపుటము: 02-266 పల్లవి: కోటానఁ గోట్లాయ కోరికెలు జన్మములు కూటువ గూడి రాట్నపుగుండ్ర లైనారయ్యా చ. మిన్ను పైనున్న జీవులు మన్నుపైఁ బ్రవేశించి అన్నద్వారమున దేహము మోఁచి మున్నిటి దానఫలా లిమ్మల భుజించి యప్పటి తిన్నని కర్మములు గాదెలఁ బోసేరయ్యా చ. యిరవు మఱచి మఱి యెరవులకాఁపిరేల సురలు నరులమంటాఁ జొక్కిచొక్కి సారిది లోకములెల్లాఁ జొచ్చి కాలగతులను పొరి నాయుష్యము గొల్చిపోయుచున్నారయ్యా చ. దండగాఁగఁ దిరుమలకొండయెక్కి సుజ్ఞానులు పండిన మనసుతోడ బత్తినేసి అండనే శ్రీవేంకటేశు నలమేల్మంగనుఁ గొల్చి నిండునిధానములై నిల్చినారయ్యా రేకు: 0307-04 గుండక్రియసంపుటము:04-040 పల్లవి: కోటికిఁ బడగయోత్తి కొంకనేల యీటులేని పదమక్కి యిఁకనేల చింత చ. పెట్టినది నొసలను పెద్ద పెద్ద తిరుమణి కట్టినది మొలఁ జిన్నకౌపీనము