పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

492 రట్టడి కలశాపుర దిట్ట హనుమంతుడు చ. చెచ్చెర వీనుల నాలించేది సురల నుతులు కొచ్చికొచ్చి తోఁకఁ జుట్టుకొన్నది నింగి తచ్చి చూచేది కన్నుల దాసులమీఁది కరుణ రచ్చకెక్కెఁ గలశాపురము హనుమంతుఁడు చ. వసుధ మతిలోనిది స్వామికార్యవిశ్వాసము వెసఁ దన పనైనది విష్ణుభక్తి పసగా శ్రీవేంకటేశ బలు నీ బంట్లలోన రసికుఁడు కలశాపురము హనుమంతుఁడు రేకు: 0348-04 ముఖారి సంపుటము:04-282 పల్లవి: కొలువరో మొక్కరో కోరి తలఁచరో చెలఁగి మనల రక్షించీని వీఁడె చ. పాయపువాఁడు నల్లఁబల్లిచెన్నుఁడు వేయినామములవెన్నుఁడు పాయకకొల్చిన భక్తప్రసన్నుఁడు యీయెడనే వరములు యిచ్చీని వీఁడే చ. పరిపూరుఁడు మహానుభావుఁడు తిరమగు దేవాధిదేవుఁడు పరమానందస్వభావుఁడు గరిమెC గరుణతోఁ గాచీని వీఁడె చ. తెలియుఁడీతఁడె దేవాగ్రగణ్యుఁడు వలనుగ యోగీంద్రవరేణ్యుఁడు అలరఁగ శ్రీవేంకటాచలేశపుణ్యుఁడు నలిఁ బ్రసన్నుఁడై నవ్వీని వీఁడె రేకు: 0385-01 రామక్రియ సంపుటము: 04-492 పల్లవి: కొలువరో మొక్కరో కోరినవరము లిచ్చీ సులభుఁ డిన్నిటా వీఁడె సుగ్రీవ నరహరి చ. కంబములోనఁ బుట్టి కనకదైత్యునిఁ గొట్టి అంబరపు దేవతల కభయమిచ్చి పంబి సిరిఁ దన తొడపైఁ బెట్టుక మాటలాడీ అంబుజాక్షుఁడైనట్టి యాదము నరహరి చ. నానా భూషణము లున్నతి తోడ నిడుకొని పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి మానవులకెల్లను మన్నన చాలా నొసంగి ఆనందముతో నున్నాడు( అదిగో నరహరి చ. మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ అక్కజపు మహిమల నలరుచును తక్కక శ్రీ వేంకటాద్రిఁ దావుకొని వరాలిచ్చీ చక్కదనముల కెల్లాఁజక్కని నరహరి రేకు:0291-02 పాడి సంపుటము: 03-525 పల్లవి: కొలువు విరిసె నిదె గోవిందుఁడు పొదువోయ వెలుపటనుక్కళాలు వేగుదాఁకా నుండరో చ. యీ పొద్దుకుఁ బోయిరారో ఇంద్రాది దేవతలు శ్రీపతి పవ్వళించెను శేషునిమీఁద తీపులఁ బ్రసాదమీరో దేవమునులకు నెల్ల