పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

491 ఆవలఁగంసుఁజంపిన ఆగోవిందుఁడితఁడు చ. క్రూరకాళింగమర్దన గోవిందుఁడితఁడు వీరచక్రాయుధపు గోవిందుఁ డితఁడు కోరి సముద్రాలు దాఁటే గోవిందుఁడితఁడు ఆరీతి బాలురం దెచ్చేయా గోవిందుఁడితఁడు చ. కుందనపు కాశతోడి గోవిందుఁడితఁడు విందుల రేపల్లె గోవిందుఁడితఁడు పొంది శ్రీవేంకటాద్రి పెపొసఁగఁ దిరుపతిలో అందమై పవ్వళించిన ఆ గోవిందుఁడితఁడు రేకు: 0273-02 సాళంగంసంపుటము: 03-419 పల్లవి: కొలిచినవారల కొంగు పైఁడితఁడు బలిమిఁ దారకబ్రహ్మ మీతఁడు చ. యినవంశాంబుధి నెగసిన తేజము ఘనయజ్ఞంబులఁ గల ఫలము మనుజరూపమున మనియెడి బ్రహ్మము నినుపుల రఘుకులనిధాన మితఁడు చ. పరమాన్నము లోపలి సారపుఁజవి పరగిన దివిజుల భయహరము మరిగిన సీతామంగళసూత్రము ధరలో రామావతారం బితఁడు చ. చకిత దానవుల సంహారచక్రము సకల వనచరుల జయకరము వికసితమగు శ్రీవేంకటనిలయము ప్రకటిత దశరథభాగ్యం బితఁడు రేకు:0284-01 శ్రీరాగం సంపుటము: 03-482 పల్లవి: కొలిచినవారి పాలి కొల్లలివివో యిల నిట్టి దైవమవు యిఁక వేరేకలరా చ. ಯೆನ್ಜಿನಿ నభయహస్త మెత్తుక కాచుకున్నాఁడ వట్టె దాసులఁ గాచేనంటా నీవు తొట్టిన పాపాలు పోఁదోలు నీ నామమంత్రాలు జట్టిగా లోకాల వెదచల్లినాఁడవు చ. తలఁచినవారికెల్లా ధనధాన్యా లిత్తునంటా వొలసి శ్రీసతి మోచుకున్నాఁడవు యిలఁ బావనులఁగా నిందరిఁ జేసేనంటా ධිෆ8ධLC బాదతీర్థ మేరు చేసినాఁడవు చ. పుట్టించ జీవులను భువనము లోపల గట్టిగ బ్రహ్మను నాభిఁ గన్నాఁడవు అట్టుగఁ బాలుపడి చుట్టి రక్షకత్వానికే యిట్టే శ్రీవేంకటాద్రి యొక్కినాఁడవు రేకు:0240-06 నాట సంపుటము: 03-232 పల్లవి: కొలిచినవారికిఁ గొమ్మని వరములిచ్చీ వెలయఁ గలశాపుర వీధి హనుమంతుఁడు చ. బెట్టుగా నొకచేతఁ జూపెడి తన ప్రతాపము పట్టుకున్నాఁ డొకచేతఁ బండ్లగొల మెట్టుకొన్నవి రాకాసిమెదడుతోడి తలలు