పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

487 యెన్నెని పొగడవచ్చు యీతఁడే మా దేవుఁడు చ. సిరులిచ్పన దేవుఁడు సేవగొనేటి దేవుఁడు గురుఁడై బోధించి చేకొన్న దేవుఁడు మరిగించిన దేవుఁడు మాటలాడించే దేవుఁడు ఇరవై మాయింటనున్నాడీ దేవుఁడు చ. దాపుదండైన దేవుఁడు దరిచేర్చిన దేవుఁడు రూపు చూపె నిదివో బోరున దేవుఁడు శ్రీ పతియైన దేవుఁడు శ్రీ వేంకటాద్రి దేవుఁడు చేపట్టి మమ్మేలినాఁడు చేచేతనే దేవుఁడు పె.శ్రీ.అ.రేకు: 8009-01 భూపాళం సంపుటము: 15-460 పల్లవి: కొండా చూతము రారో కోండుక తిరుమలకొండా కొండని యడిగిన వరము లొసఁగు మా కొండలతిమ్మయ కొండా చ. మేరువు మును స్తుతియింపఁగను వారిజసంభవుఁడా పేరు కలుగు నవరత్నంబులు బంగారము కల్పతరువూ మేరకు మీఱఁ గని నెలవున నారుగ నిడెనొకో యనఁగా ధారుణి బ్రహ్మాండములకు నాధారంబగు మా కొండా చ. గరుడాచలం బనఁగా శ్రీవేంకటశైలం బనఁగా గిరులకు నేలికె యగు ననంతగిరి దా నీ గిరి యనఁగా సిరులాయఁ జనమగు యంజన శబరి యనెడి నామములా పరగఁగ నాలుగు యుగముల వెలసిన ప్రబలంబగు మా కొండా చ. పాందలూ సాంపగు నింపుల పూబ్దలూ వాసననదులూ కొదలూ గల తామరకొలఁకులపై మొదలుఁ దుమ్మెదలూ కదలి మలయానిలు వలపులపన కదళీవనములునూ మొదలు గా నెల్లప్పుడు నీ సంపదలు గల మా కొండా చ. జంతువు లెల్లను మునులూ సకలమైన దేవతలూ జంతువుల యెలుఁగులు వేదసారంబగు హరినుతులూ చింతామణులట రాళ్లేల్లను సిరులనెలవు లా గుహలూ సంతతసౌభాగ్యంబుల నొప్పెడు సందడిగల మా కొండా చ. వొకచో బ్రహ్మాదులు మునులును వొకచో నింద్రాదులునూ వొకచో భాగవతులు యతులు శ్రుతులు వొకచోఁ జంద్రార్కులు వొకచో తీర్ధంబులు గిరులును వొకచో యోగీశ్వరులూ అకలంకత తనుఁ గోరి తపము సేయ నాస లెఱుఁగు మా కొండా చ. శుకములతోఁ జదువుదురా శుకబ్రహ్మాదులు శ్రుతులూ తకదిమ్మనియాడించు మయూరతతిని యోగీశ్వరులూ సకలపురాణంబులు విందురు మఱి పికశారికలచే మునులూ ప్రకటితముగ నీ విద్యల నొప్పెడు భాగ్యముకల మాకొండా చ. స్వామితీర్ధములకును స్వామిపుష్కరణియునూ పామరులా యమరులఁ జేయును పాపవినాశనమూ తా మహిఁ గోరిక లిచ్చుఁ గుమారధారయు పాండవసరసీ కామితఫలదాయిని ఆకాశగంగయుఁ గల మూ కొరెండా చ. యిదియె క్షీరాంబుధి యనుచు మరి యిదియె ద్వారక యనుచు యిదియె నందవ్రజ మనుచును మరి యిది దా నయోధ్య యనుచూ యిదియె వైకుంఠం బనుచును యిది పరతత్త్యంబనుచు యిదియె పరమపదం బనుచు వేదములు యెన్నఁగఁ గల మా కొండా చ. త్రలఁచిన శుకశౌనకాదులకు త్రలఁచిన తలఁ పారిసఁగినా