పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

486 చ. వెలయఁ జిత్తంబునకు వేరుపురువై బుద్ధి గలఁగించె మోహవికారము కలకాలమునకు లింగము మీఁది యెలుకంమై తలకొనియె నాత్మ పరితాపము చ. అరయఁ జంచలముచే నాలజాలంబువలెఁ దిరుగదొరకొనియెఁ దనదేహము తిరువేంకటాచలాధిపుని మన్ననఁగాని పరిపాటిఁ బడదు తనభావము రేకు: 0331-04 కౌశి సంపుటము: 04-181 పల్లవి: కొండంతపాడవుతోడ కోనేటిరాయఁడు వీఁడె నిండుకొని రథమెక్కి నిలుచున్నవాఁడు చ. పాతాళవాసులైన బలురక్కసుల మీఁద యేతులఁ బరపెఁ దేరు యిదె దేవుఁడు ఆతల జలధిచొచ్చినట్టి దానవులమీఁద పూత్రతోడఁ దోలె నదె కడు రభసమున చ. ఆకాశము దూరినట్టి యదటు దైత్యులమీఁద దాకతో నడపించెఁ బంతాన దేవుఁడు దీకొని యష్టదిక్కులఁ దిరిగి యసురలపై భీకరముగా మోగించె బిరుదులు మెరసి చ. ధరమీఁదఁ గలిగిన దనుజకోట్ల నెల్ల సారిది శ్రీవేంకటేశుఁడు పారఁదోలెను గరిమ నలమేల్మంగ నురమునఁ బెట్టుకొని తిరముకొలిపెఁ దేరు దిక్కులెల్ల గెలిచి రేకు:0025–03 సామంతం సంపుటము: 01-151 పల్లవి: కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు కొండలంత వరములు గుప్పెడు వాఁడు చ. కుమ్మరదాసుఁడైన కురువరతినంబి ఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాఁడు దొమ్మలు సేసినయట్టి తొండమాంజక్కురవర్తి రమ్మనచోటికి వచ్చి నమ్మినవాఁడు చ. అచ్చపు వేడుకతోడననంతాళువారికి ముచ్చిలి వెట్టికి మన్నుమోఁచినవాఁడు మచ్చిక దొలఁకఁ దిరుమలనంబితోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు చ. కంచిలోన నుండఁ దిరుకచ్చినంబిమీఁదఁ గరు ణించి తనయెడకు రప్పించినవాఁడు యొంచ నెక్కుడైనవేంకటేశుఁడు మనలకు మంచివాఁడై కరుణఁ బాలించినవాఁడు రేకు:0385-05 గుజ్జరి సంపుటము:04-496 పల్లవి: కొండవంటి దేవుఁడు నేఁ గొలిచే దేవుఁడు వీఁడే నిండుకున్నాఁడు తలఁచు నెమ్మదినో మనసా చ. నన్నుఁ బుట్టించే దేవుఁడు నాలోనున్నాఁడు దేవుఁడు కన్నచోటులనే వుండే కాచే దేవుఁడు వెన్నతోఁబెంచే దేవుఁడు వివేకమిచ్చే దేవుఁడు