పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

485 చ. చేపట్టి నీశిరసు పూజించే అహమికకంటే నీపాదాలు పూజించే నేను మొక్కుడు మాపుదాఁకా నినుఁగొల్చి మందెమేళమాకంటే దాపగు నీదాసుల శేషత్వ మొక్కుడు చ. హరి నీపస్తాదజ్వినై గర్వించుటకంటే నరయ నీదాసులలెంకె టెక్కుడు వెరవున నీచెవిలో విన్నపాలు సేయుకంటే ధర నీవూడిగకాండ్లఁ దలఁపించు టెక్కుడు చ. జట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్య మందుటకంటే అట్టె నీనామఫలమందు టెక్కుడు ఇట్టె శ్రీవేంకటేశ యేలితి విందువంకనే తిట్టపు మాగురు నుపదేశ మొక్కుడు రేకు: 9029-02 సామంతం సంపుటము: 04-548 పల్లవి: కొంచపడితినొక కొన్నాళ్ళు ఇంచుకించుకిపుడెరిఁగితి నేను చ. ముట్టుపాఁతవలె మురిగిన దేహము గుట్టున దాఁచితిఁ గొన్నాళ్ళు ఇట్టే సుఖమని యిన్నిటి యోనుల ఒట్టుక కాఁపురముండితి నేను చ. మురికి కడువలే ముంచిన హేయము కురిసితి నేనొక కొన్నాళ్ళు తెరపి లేక యీ దేహమురోఁతల మొరఁగి దాఁచితిని మూలల నేను చ. విప్పుచు ముడుచుచు వెంట్రుకతుట్టెల కొప్పులె పెట్టితి గొన్నాళ్ళు అప్ప వేంకటనగాధిప మీకృప యిప్పుడు వెలసితి నిదివో నేఁడు రేకు:0064-02 శ్రీరాగం సంపుటము: 01-329 పల్లవి: కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁదలఁచు పంచమహపాతకుఁడే బ్రహ్మణోత్తముఁడు చ. వేదములుచదివియును విముఖుఁడై హరికథల నాదలించనిసారీ మయూజికంటె యేదియునులేనికులహీనుఁడైనను విషు పాదసేవకుఁడువో బ్రహ్మణోత్తముఁడు చ. పరమమగువేదాంతపఠన దొరకియు సదా హరిఁదలఁచలేని సన్న్యాసికంటె మరిగి పసురముఁదినెడిమాలయైనను వాఁడె పరమాత్ముఁ గొలిచినను బ్రహ్మణోత్తముఁడు చ. వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథా తనువు వేఁపుచుఁ దిరుగతపసికంటె చనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁ బనిదిరుగునధముఁడే బ్రహ్మణోత్తముఁడు రేకు:0062-06 బౌళి సంపుటము: 01-321 పల్లవి: కొండ దవ్వట యెలుక గోరిపట్టుట దీన బOడాయ సంసారబంధము