పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

484 చ. హరినిర్మితములే అఖిలప్రపంచము తొరలి యేమిటి నిందు దూషించేది ధరణిధరునికి దాసులే జీవులెల్లా గరిమ నెవ్వరి నిందుఁ గాదనేది చ. వాసుదేవు కల్పితమే వరసంసార బంధము దోసమంటా యెందెందు దొలఁగేది శ్రీసతీశు రచనలే చేకొన్న రుచులెల్ల యీసుతోడ నిందుమింద నెట్టురోసేది చ. గోవిందుమాయలే కూడినట్టి పనులెల్ల వేవేలై యిందునెట్టు వేసరేది శ్రీవేంకటేశుఁడే చిత్తములో ధ్యానమెల్లా పావనమైతిమి యిఁక బరచింత యేది పె.అ.రేకు: 0032-02 లలిత సంపుటము: 15-178 పల్లవి: కైకొనవయ్యా కరివరదా నీకే శరణము నిలింపవరదా చ. పాండవవరదా పద్మజుని యజ్ఞ గుండములో నున్న గురువరదా మెండుగ ధ్రువునిని మెచ్చినవరదా దండము నీ కిదె ద్రౌపది వరదా చ. బలివరదా యంబరీషవరదా వలనగు నక్రూరవదరా బలిమి నటించిన ప్రపదవరదా కొలిచెద మిదె నిన్నుఁ గుచేలుని వరదా చ. నారదవరదా నమో శుకవరదా సారస గుణ విభషణవరదా కారుణ్య శ్రీవేంకటగిరివరదా చేరి నుతించెద శ్రీపతి వరదా రేకు: 0338-01 బౌళిరామక్రియ సంపుటము:04-220 పల్లవి: కైకొన్నకొలఁది కర్మము వాకుచ్చి తనతోనే వగవంగనేలా చ. తలఁచినకొలఁదేదైవము తనకలపుకోలుకొలఁదే కడనరులు బలువుకొలఁదియే పంతము తొలఁగర యితరుల దూరంగనేలా చ. మచ్చిక నొడివినంతే మంత్రము అచ్చపుభక్తి కొలఁదే యాచార్యుఁడు నిచ్చలుఁగోరినయంతే నిజమైన లోకము పచ్చివెచ్చిచదువుల భ్రమయఁగనేలా చ. నెమ్మది జాతెంతే నియమము సమ్మతించినంతే సంతోసము యిమ్ముల శ్రీవేంకటేశుఁడిచ్చినంతే యిహపరమెమ్మెల కిది మరచి యేమరఁగనేలో రేకు: 0194-04 దేసాళం సంపుటము:02-483 పల్లవి: కైవల్యమునకంటే కైంకర్య మొక్కుడు శ్రీవిభుఁడ నీవు మాకుఁ జిక్కేమర్మమిదివో