పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

483 చ. కిరణార్క కోటి తేజ కేశవా హరి లక్ష్మీనాయక యాది కేశవ గిరి రాజసుత నుత కేశవ నమో శరధి గంభీర శాయి జయ జయ కేశవా చ. కేకిపింఛావతంస కేశవ శ్రీ కర గుణాభి రామ చెన్నకేశవ కేక వాహన వరద కేశవ పాక శాసన వంద్య భళి భళి కేశవా చ. కింకర బ్రహ్మాది గణ కేశవ నా - మాంకిత శ్రీ వేంకటాద్రి కేశవ కుంకుమాంకవక్ష వెలిగోట కేశవ సర్వ - శంకా హరణ నమో జగదేక కేశవా రేకు:0174-04 శ్రీరాగం సంపుటము:02-365 పల్లవి: కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు చ. నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు యిమ్మల లక్షిపతివి యేలిక వైతివి గన సమ్మతి మాకు సర్వసంపదలు గలవు చ. పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన దట్టముగ నెంచగఁ బదసుఁడ నేను తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను చ. గురువవు గొల్లలకు గోవింధరాజవు గన నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు పరము నిహము మూకు బలువుగాఁ గలిగె రేకు: 0194-03 లలిత సంపుటము:02-482 పల్లవి: కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను యీ శరీరపు నేరా లిఁకనేలా వెదక చ. నిచ్చలుఁగోరికలియ్య నీనామమే చాలు తెచ్చి పునీతుఁ జేయ నీతీర్థమే చాలు పచ్చిపాపా లణఁచ నీప్రసాదమే చాలు యొచ్చుకొందు వుపాయాలు ఇఁకనేల వెదక చ. ఘనునిఁ జేయఁగను నీకైంకర్యమే చాలు మొనసి రక్షించను నీముద్రలే చాలు మనిపి కావఁగఁ దిరుమణిలాంఛనమే చాలు యొనసెను దిక్కుదెస ఇఁకనేల వెదక చ. నెలవైన సుఖమియ్య నీధ్యానమే చాలు అల దాపుదండకు నీయర్చనే చాలు యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకుఁ గలవు యెలమి నితరములు యిఁకనేల వెదక రేకు: 0326-01 గుండు క్రియ సంపుటము: 04–148 పల్లవి: కైకొంటే కాక కమలనాభునియాజ్ఞ పైకొని ఇన్నిటాను బాసివుండ ఇనేది