పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

478 యెన్నికదినాలచేత నెప్పుడేడఁ బడునో కన్నవారిచేతికి గక్కున నియ్యరే చ. తోలునెముకలచేత దొడ్జెన యూదేహము గాలిచేత దాలిమీఁదఁ గాగీని కీలుగీలు యెప్పుడేడ కింద వీడిపడునో మేలుఁగీడు లేనిచోట మేఁటిఁజేసి పెట్టరే చ. కింకపుకిసరుచేత కీడైన దేహము వంకవంకతెరవుల వడీసీని యింక నీవిధిచేత నెప్పుడేడఁ బడునో వేంకటేశుఁజేరఁ బడవేయఁగదరే రేకు:0010-03 సామంతం సంపుటము: 01-063 పల్లవి: కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_ కీలువదలె సౌజన్యము కిందయిపోయినది చ. ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మము కందయినది,విజ్ఞానము కడకుఁ దొరెలంగినది, గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ,వివేకము మందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు చ. మఱియింక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_ వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ, కొఱమాలెను నిజమంతయు,కొండలకేఁగెను సత్యము, మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి చ. తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు, సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు , త్రిమిరO29Oత్రయుఁ బూపఁగఁ దిరువేంకటగిరిలక్షీరమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు రేకు: 0049-01 కన్నడగౌళ సంపుటము: 01-298 పల్లవి: కాలాంతకుఁడనువేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడును కాలంబనియెడితీవ్రపుగాలివెర వెరిఁగి చ. పరమపదంబు చేనికి పసిగొనునరమృగములకునును తరమిడి, సంసారపుటోఁదములనె యూఁగించి, వురవడిఁ జేసినకర్మపుటరులు దరిద్రంబనువల వొరపుగ మాయనుపోగులు వొక వెరవున వేసీ చ. కదుముకవచ్చేటిబలురోగపుఁగుక్కల నుసికొలిపి, వదలక ముదిసినముదిమే వాకట్టుగఁ గట్టి. పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడఁగ. పదిలముగా గింకరులను చొప్పరులఁ బరవిడిచీ చ. ఆవోఁదంబులఁ జిక్కక, ఆవురులనుఁ దెగనురికి, ఆవేఁటకాండ్ల నదలించాచేనే చొచ్చి, పావనమతి( బొరెవొడిచి పరమానందముఁ బొందుచు శ్రీ వేంకటపతి మనమునఁ జింతించీ నరమృగము రేకు: 0322-03 లలిత సంపుటము:04-126 పల్లవి: కావఁగ నీకే పోదు కరుణానిధివిగాన దేవ నీ బంట్లము మా తెరువేఁటి తెరువు చ. బండుబండై వూరఁగల పనులెల్లాఁ జేసేము యెండాతా నీడెతా నెఱఁగము