పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

477 నిలిపిన యట్టుండవు నేఁడు నా మాటలే నాకు పాలసి నన్నే కడు బొంకించీఁగాని చ. కలిమి లేమెరఁగదు కాయము నాదైనాను కొలఁదికి నేమైనాఁ గోరీఁగాని యిల నాయంకెకు రావు యింద్రియములు నావైనా కలసి నామర్మములే కాఁడిపారీఁగాని చ. పంపు నాకుఁ జేయదు భవమిది నాదైనా తెంపున కర్మవీధులఁ దిప్పీఁ గాని యింపుల శ్రీవేంకటేశ యిది యరాజికమాయ పంపున నీకిదె మొఱ ప్రతిపాలించంగదే రేకు: 9022-02ధన్నాసి సంపుటము: 04-541 పల్లవి: కాయముల కాణాచి కాఁపులము చాయల మా సుఖము జయమేఁటిదయ్యా చ. పంచ మహా పాతకాల బైరు విత్తి దేహాల కంచపుఁ గొలుచులుగా గాదెలఁబోసి చంచలాలు జవ్వనాలు చవులైన కూరలుగా నించి భుజియించే మానిజమేఁటిదయ్యా చ. ఉడివోని లంపటాన నూళ్ళుఁ బల్లెలు నెక్కి యిడుమల మమతల నిండ్లు గట్టి గిరెడవలానానసల కూలిమి సంపదల పొడవైన మామతి పొందేఁటిదయ్యా చ. పనిలేని మమతల్ల పాపములు బందాలు గొనకొని ధనములు గూడపెట్టి కని నేఁడు తిరు వేంకటపతి కృపతోడ తనియని మాతోడి తగువేఁటిదయ్యా పె.అ.రేకు:0053-06 సాళంగనాట సంపుటము: 15-304 పల్లవి: కాలమందే నీ దాసులై కడు ధీరులౌట గాక యీలాగున మోసపోతి నేమిటా నే మున్నది చ. పొనిఁగి యింద్రునినై నాఁ బోనీదు కోపము మునుకొని రుద్రునెనా ముంచుఁ గోపము వెనుకొని బ్రహ్మనైనా విడువదు కోపము మనికియెన దేవత్వమహిమ యే మున్నది చ. వడి విశ్వామిత్రునంతవానికి రేఁగెఁ గోపము కెడపి దుర్వాసునిఁ జక్కించెఁ గోపము యెడనెడ మునులను యేమరించుఁ గోపము బడిఁ దపనుల బల్మి పలుక నే మున్నది చ. కచ్చు పెట్టి ధర్మజునిఁ గనలించెఁ గోపము కొచ్చి కార్తవీర్యుఁ బురికొల్పెఁ గోపము నిచ్చలు శ్రీవేంకటేశ నీవే శాంత మిచ్చితి గా కిచ్చల రాజ్యపదవి యెంచ నే మున్నది రేకు:0050-02 సామంతంసంపుటము: 01-305 పల్లవి: కాలము కాలము గాదు కపటాలే తఱచాయ చాలునింక దీనితోడిజాలి మానరే చ. పిన్ననాట నుండి తనపెంచిన యీదేహము మున్నిటివలెగాదు ముదిసీని