పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

476 కైపు గాక రుచులపై కాంక్షి మాని మఱి కదా వోపి లోకముల సడ్డ వొల్లకుండేది చ. పంచేంద్రియముల నెల్ల పారఁదోలి మఱి కదా వుంచపువిరక్తి కెల్ల వొడి గట్టేది కొంచెపు కోరికెల్ల కోరకుండి మఱికదా వంచి హరిదాసులలో వహి కెక్కేదీ చ. వేవేలు పనులెల్ల విడిచిన మఱికదా శ్రీవేంకటేశ్వరునిఁ జింతించేది భావించి యితని దాసపరికరమై కదా త్రోవ చూచి మోక్షము తుది కెక్కేది రేకు:0097-06 బౌళి సంపుటము: 01-488 పల్లవి: కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయ పాయక తిరిగాడేరు పాపపుతలారులు చ. కాముఁడనియెడిరాజు గద్దెమీఁద నుండఁగాను దీము గోపపుప్రధాని దిక్కు లేలీని కోమలపుజ్జనమెల్లాఁ గొల్లఁబోయ నాడనాడ గామిడులై రింద్రియపుఁగాపులెల్లా నిదివో చ. చిత్తమనేదళవాయి చింతలనేపౌఁజు వెట్టి యిత్తలవిషయములు యెన్నికిచ్చిరి తుత్తుము రైకోరికెల దొండెము రేఁగఁగఁజొచ్చె జొత్తుల వెరగుపడిచూచీఁ బుట్టుగులు చ. బలుసంసారమనేటిభండారము ఘనమాయ కలదీగి జవ్వనపుకై జీతము యిలలో శ్రీవేంకటేశుఁడింతలో జీవుఁడనేటి బలువుని రాజుఁజేసి పాలించె నన్నును రేకు:0068-01 నాట సంపుటము: 01-352 పల్లవి: కాయము జీవుఁడుగలనాఁడే తెలియవలె యూయత్నములు దనకెన్నఁడు చ. సతతము సంసారజడుఁడు దానట యాత్మ హితవు దెలుసుకాల మెన్నఁడు రతిసరసముల పూరకే ప్రాయ మెడలంగ యుతరసుఖము దన కెన్నఁడు చ. యెడపక ద్రవ్యమెహితుఁడై తిరుగఁ దన. యిడుముపాటు మాను టెన్నఁడు కడలేనిపాలయలుకలచేతఁ దనదేహ మిడియఁగ నిజసుఖ మెన్నఁడు చ. శ్రీవేంకటేశునిఁ జేరి తక్కినసుఖ మేవగించుకాల మెన్నఁడు శ్రీవల్లభునికృప సిరిగాఁ దలఁచి జీవుఁ - డీవైభవముఁ గాంచు టెన్నఁడు రేకు: 0310-04 గుండక్రియ సంపుటము: 04-058 పల్లవి: కాయము నాదే ఆట కర్తను నే నట నా చాయకవి రావు నన్నే జరసీఁగాని చ. తలఁచినట్టుండదు తలఁపునాదైనాను కులికి నన్నే పనిగొనీఁగాని