పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

479 కొండలరాయఁడ మమ్ముఁ గోరి పుట్టించఁగా నీవు బెండువంటి వారము మా బిగు వేఁటిబిగువు చ. దీనుఁడనై యాసలనే దిక్కులెల్లాఁ దిరిగేము కాని దెందో మంచి దెందో కానము శ్రీనాథ నీవు మాకు జీవమయి వుండఁగాను మానువంటి వారము మా మనసేటి మనసు చ. బొందితోడఁబుట్టితిమి భోగించేమేమైనా యెందుకాతా నేడకౌతా నెఱఁగము యిందును శ్రీవేంకటేశ యిహముఁ బరము నీవే చెంది నీ దాసులము మా చేఁత యేఁటిచేఁత రేకు: 0364-05 నారాయణి సంపుటము: 04-379 పల్లవి: కావఁగ నీకే పోదు కరుణానిధివిగాన భావించి నీవని తుదపదమే యొక్కితిమి చ. కరి రాజ వరద నీకడనున్నవారికి కరిరాజభయము లెక్కడాఁ బొందవు సిరుల నీయర్ధమే ᎦᏇO&OᎦᏇ ᎦᏇO&OᎦᏇ నరలోకమెల్ల నీనగమె యొక్కితిమి చ. కాళింగమర్దన నిన్నుఁగని మనువారికి కాళింగభయములెక్కడా లేవు తాలిమితో నిదియే తలపాణిసి తలపాశీసి కేలి మనుజులము నీగిరియె యొక్కితిమి చ. కందువ శ్రీ వేంకట కటకేశ నీవద్ద - నెందుఁ గటకేశభయమిఁక లేదు యిందుకే పో జగమెల్లా నిటు శరణని మూల కందువ నీదండ శ్రీ వేంకటమె యొక్కితిమి పె.అ.రేకు:0075-05 సాళంగనాట సంపుటము: 15-433 పల్లవి: కావకుంటే నేదీ గతి కమలాక్షా యిందరికి నీవు వుపకారివై నిలిచితి గాకా చ. జీవు వీడేరే కొఱకు శ్రీరంగవెంకటాద్రి దేవభూములందు నీ దివ్యమూర్తులు చూపి వేవేలు నీ గుణములు వేదశాస్త్రములఁ దెల్సి యీవలా రక్షించేవు నిన్నేమని నుతింతుము చ. అంతటా బాదతీర్ధములైన గంగాదినదులు పొంతనే యాడాడకు పుణ్యపురుషుల నిల్పి వంత దీర నేకాదశివ్రతాచారాలు గల్పించి యెంతెంత ప్రయాసపడే విదే పనై నీవు చ. నానావిధమంత్రపు నీ నామజపము గల్పించి ధ్యానము యజ్ఞము మొదలైన పూజలు గడించి యీ నెపాన శ్రీవేంకటేశ బ్రదుకు మనుచు కానుకగొని యిచ్చేవు ఘనవరములను రేకు:0043-05 శుద్దవసంతం సంపుటము:01-265 పల్లవి: కిం కరిష్యామి కిం కరోమి బహుళ శంకాసమాధానజాడ్యం వహామి చ. నారాయణం జగన్నాధం త్రిలోకైక పారాయణం భక్తపావనం