పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

473 అపురూపమైన నారాయణనామ ముచ్చరించే ప్రపన్నులతోడి సరియా బ్రహ్మదులు చ. మహిలోఁ బుణ్యములంటా మదియించగ మీ కేల మహిలోఁ బుణ్యులు గారా నహుషాదులు సహజపుద్వయానుసంధాన పరులైన వహి కేక్కే వైష్ణవులవంటివారా సురలూ చ. అందేము సర్గలోకమంటా రాజస మేల అందఁడా స్వర్గము నరకాసురుఁడు చందపు శ్రీ వేంకటేశు చక్రలాంఛనులతో పొంది జీవన్ముక్తులకు పురుఁడా సోమపులు రేకు:0255-06 దేసాక్షి సంపుటము: 03-319 పల్లవి: కానరు నాలుగు కరములవానిని శ్రీనాథుండని చేరఁగవలదా చ. ఘనచక్రముతో గరుడనినెక్కుక కినిసి మెరయు నలకృష్ణునిని ఘనులై ఇప్పటికాలపు మనుజులు మునుప ಏಮ್ಸಿ(ಜಿನಿ మొక్కఁగవలదా చ. పలుదేవతలకు భయములు మాన్పుచు అల విశ్వరూపమైనపుడు చలము మాని యచ్చటికౌరవులును తెలిసి దేవుఁడని కొలువఁగవలదా చ. చెప్పిన యితఁడే శ్రీవేంకటమున యెప్పుడు వరములు ఇయ్యఁగను తప్పక యీతని దాసులవలెనే యిప్పటివారలె యొరఁగఁగవలదా రేకు:0200-05 లలిత సంపుటము: 02-518 పల్లవి: కానవచ్చీఁ గానరావు కమలాక్ష నీమాయ తానే వెంటవెంటఁ దగిలీ నిదివో చ. తొల్లి నీవు గలవు తోడనే నేఁను గలను యెల్లగా నీప్రపంచము యింతాఁ గలదు కొల్ల యెద్దు లెప్పటివే గోనెలే కొత్తలైనట్టు చల్లని నేనొకఁడనే జన్మములే వేరు చ. వేదములు నాటివే వినుకులు నాటివే ఆదినుండి చదివే నదియే నేను వేదతో వెన్నవట్టి నేయి వెదకఁబోయినయట్టు దాదాత నాతెలివి యితరుల నడిగేను చ. వైకుంఠమూ నున్నది వరములు నున్నవి యీకడ శ్రీవేంకటేశ యేలితి నన్ను కైకొని పువ్వు ముదిరిగక్కనఁ బిందెయెనట్టు నీకు శరణనఁగాను నే నేడేరితిని రేకు: 0188-06 శంకరాభరణం సంపుటము: 02-449 పల్లవి: కానవచ్చె నిందులోన కారుణ్యనరసింహా తానకమై నీకంటే దాస్యమే పో ఘనము చ. యెనసి ప్రహ్లాదుఁడు యొక్కడఁ జూపునోయని ననిచి లోకమెల్ల నరసింహగర్భములై