పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

474 పనివూని వుంటి వటు భక్తపరతంత్రుఁడవై తనిసి నీ వధికమో దాసులే యధికమో చ. మక్కువ బ్రహ్మాదులు మానుపరాని కోపము ఇక్కువై ప్రహ్లాదుఁడు యెదుట నిలిచితేను తక్కక మానితి వట్టే దాసుని యాధీనమై నిక్కి నీకింకరుఁడే నీకంటే బలువుఁడు చ. ఆరసి కమ్మర ప్రపదవరదుఁడని పేరువెట్టుకొంటి విట్టే బెరసి శ్రీవేంకటేశ సారె నీశరణాగతిజనుని కాధీనమైతివీరీతి నీదాసునికే యిదివో మొక్కేము రేకు:0284-02 భైరవి సంపుటము: 03-483 పల్లవి: కాను స్వతంత్రుఁడననఁ గాదని తలఁగ లేను నేను నీ కింకరుఁడ నీ రచనలే చ. యెంతైనాఁ దీరదిదే యెందుచూచిన పనులు అంతటాను నీమాయ అలయించగా దొంతులగుఁ గర్మములు తోడనే తిరిగీని సంతకూటపు బ్రతుకు సటలఁబెట్టీని చ. మాన వింద్రియము లివి మతిలోనఁ బెరరేఁచు నానాగము(తు?)లఁ బ్రకృతి నటియుంచఁగా పూని పురాకృతములు పోనీక తిరిగీని సానఁ బట్టిన వయసు సటలఁబెట్టీని చ. తరవులనే పెట్టీని తతిలేని యాసలివి నిరతంపు జన్మములు నిడుసాగఁగా వరుస శ్రీవేంకటేశ్వర నీవు నన్నేలి కరుణించఁగా భక్తి ఘనత మీరీని పె.శ్రీ.అ.రేకు: 8008-03 సాళంగనాట సంపుటము: 15-458 పల్లవి: కామక్రోధవికార జలనిధికి కలశభవుఁడు మీ నామము భీమగుణత్రయ బిసకాండములకు బిరుదుహంస మీ నామము చ. బహుళదులిత పటుపటల మును ఘన గహన దావశిఖ గణుతింపఁగ మీ నామము సహజ కలుషత్రమిస్రము దొలగింపఁగ నహ రహముల వెలిఁగెడి రవి బింబమైనది మీ నామము చ. జననబంధదోషములను గిరులకు ననుపమ మగు నిష్టుర నిర్ధాతం బరయఁగ మీ నామము ఘనసంసారం బను పెనుసర్పం బునకును ముదమున గరుడుఁడు మీ నామము చ. తీరని పంచేంద్రియ మేఘములకు ఘనోరమారుతవిహారం బైనది మీ నామము శ్రీరమణీశ్వర శ్రీవేంకటపతి ధారుణిఁ బొగడఁగఁ దగినది మీ నామము రేకు: 0195-03 లలిత సంపుటము:02-488 పల్లవి: కామధేనువిదె కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు చ. హరినామజపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము