పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

472 చక్కనివాఁడవు మరి చంద్రసూర్యనేత్రుఁడవు వుక్కు మీరి నీ వెట్టానుండినా నమరును చ. కామునిఁ గన్నతండ్రివి కడుఁ జక్కఁదనమున ఆముకొన్నయట్టి చక్రాయుధుఁడవు కామించి యెందుఁ జూచినా గరుడవాహనుఁడవు వేమరు నీవెటువలె వెలసినా నమరును చ. అందరి లోపలనుండే అంతర్యామివి నీవు చందమైన పరబ్రహ్మస్వరూపుఁడవు యెందును శ్రీవేంకటాద్రి నిరవైనవాఁడవు అంది మమ్ము నేలితేను అన్నిటా నమరును రేకు:0250-04 దేసాళం సంపుటము: 03-287 పల్లవి: కాదన్నవారికి వారికర్మమే సాక్షి యేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి చ. వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమై ఆదటఁ దెచ్చి నిలిపెనది సాక్షి ఆదిఁ గర్మములు సత్యమనౌటకు బ్రహ్మాయఁగాన పోదితో నీతఁడు యజ్ఞ భోక్తాటే సాక్షి చ. అదె బ్రహ్మము సాకారమటకు పురుషసూక్తం మెదుట విశ్వరూపము యిది సాక్షి మొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకు పొదిగొన్న యాగములే భువిలో సాక్షి చ. బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి యిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతఁడనుటకు వరమిచ్చే శ్రీవేంకటేశ్వరుఁడే సాక్షి పె.అ.రేకు:0047-01 కాంబోది సంపుటము: 15-264 పల్లవి: కాదు వివేకము యిది కాదు యవివేకము సాదించి నీకు శరణు చొరవలెఁ గాని చ. కందువఁ దొల్లిటి జన్మకథ యేమి నెఱుఁగఁడు ముందరిజన్మమునకు ముంచి పుణ్యము సేసును యిందేమి గనెనో దేహి యెవ్వరి నమ్మెనో తాను సందడి భోగములలో సాములు సేసీని చ. గలిము భూమOడలము కడపల గానఁడు పరము గావలెనని పాట్లఁబడి దేహి యిరవు దనకు నేదో యెఱిఁగిన యెఱుకేదో పరగిన యాసలకే పట్టి పెనంగీని చ. తగ నిదరించేవేళ తన స్వతంత్రము లేదు మిగులా నుద్యోగించు మేలుకొనేవేళ నిగిడి శ్రీవేంకటేశ నీ వంతరాత్మ వనక వెగటుఁ జదువులలో వెదకం జూచీని పె.అ.రేకు:0025-01 లలిత సంపుటము: 15-141 పల్లవి: కానని యజ్ఞానులాల కర్మజాతులాల మీరు మానక కర్మములు సేసి మాయఁ జిక్కవలెనా చ. తపము సేసితమంటా దాఁటరాని గర్వమేల తపము రావణాదులు తగఁ జేయరా