పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

471 చ. వరుస నా నాగతులు వాలివాలి జ్ఞానములు యిరవైన గురుతు నీ విం దొక్కఁడవే పరగఁ జదువులైతే బహువిధమతములు నిరతి భక్తి యొక్కటే నిన్ను సాధించేది చ. తలఁపఁ బెక్కు మూర్తులు ధ్యానము సేసేవారికి ఫల మిచ్చేయట్టి నీ భావ మొక్కటే పలుదెఱఁగులై యుండు భజించేటి భజనలు తలకొని నీవు మెచ్చే దయ వొక్కటే చ. పాటించ సేయఁబోతే తపము లెన్నేఁ గలవు చాటి రక్షించేడి నీ దాస్యం బొక్కటే గాటపు శ్రీవేంకటేశ కల వన్ని వుపాయాలు నీటున నాకై తేను నీ శ్రీపాదములే పె.అ.రేకు:0026-03 సామంతం సంపుటము: 15-149 పల్లవి: కాదని వేరే సేయఁగలవాఁడా తాను సాదువలె నుండుఁగాక స్వతంత్రుఁడా తాను చ. దైవము పై భారము తనపైఁ బెట్టు కోనేల మోవలేక సంసారాన ములుగనేల జీవుఁడై పుట్టితే నేమి శ్రీపతి నీవాఁడనని సేవ సేయుచుండఁగానే చేరి కాచీ నతఁడే చ. యేలిక గూచుండే గద్దె యొక్కఁ దన కది యేల వీలి అపరాధనకు వెఱవ నేల ఆలు బిడ్డలకు గుణియవుటకు హరిఁజేరి కాలము గోరుకుండఁగ కరుణించీ నతఁడే చ. శ్రీ వేంకటేశు మాయకు చేరి యడ్లాలు రానేల తోవ గానక యాత్రని దూఱఁగ నేల శ్రీవైష్ణువుఁ డవుటకు చిత్తములో విష్ణు నమ్మి భావించు కొనఁగా దయ పాలించీ నతఁడే రేకు:0235-05 నాట సంపుటము: 03-202 పల్లవి: కాదనేటి వారెవ్వరు కడలనుండి సేద దేరిచి నీవేమి సేసినానుఁ జెల్లును చ. తక్కక బ్రహ్మాది దేవతలకు నాయకుఁడవు మక్కువ శ్రీసతికి మగఁడవు