పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

470 కాచి నమ్మించే యభయకరమే నాకుఁ బూఁటకాఁవు యేచిన నాలోని భయ మెల్లాఁ దేర్చీని చ. నీవు నన్నుఁ బుట్టించిన నిమిత్తమే పూఁటకాఁపు పోవక రక్షించు మని బుద్ధి చెప్పీని దేవుఁడవై నిలిచిన నీ దీమసమే పూఁటకాఁపు కేవలమై బిరుదు లెక్కించి రక్షింపించీని చ. పోనీక నీ బంట్లు చెప్పే బోధే నాకు పూఁటకాఁపు యే నెపాన నైనా నిన్ను యింటఁ బెట్టీని వూని శ్రీవేంకటేశ్వర పూఁటకాఁపు లిందరును వీనులతో నీకుఁ దామే విన్నవించేరు పె.అ.రేకు:0047-05 బౌళి సంపుటము: 15–268 పల్లవి: కాదని తోయఁగ నెంతటివారలుఘనసంసారులు నరులును సురలును నీ దాసులతో సంగతి సేయఁగనిర్మలచిత్తం బయివ్యాఁగాక చ. హరి నీ మాయె విజృంభించునట నడఁచే మన నెవ్వరితరము దరిగొని నీకె మొక్కఁగ తానే మన్నీంచీఁ గాక నిరతి నీ యాజ్ఞ జగతిఁ జెల్లునట నెట్టిన నిది గడచేవా రెవ్వరు ధరణిలోని వారమని యాదుకొనఁగ తప్పులు వట్టక కాచీఁగాకా చ. ధాత నీసుతుఁడు పుట్టించువాఁడట తగదని తోయఁగ సెవ్వఁడోపు నిఁక ఆతుమలో నిను ధ్యానము సేయఁగ నతఁడే మొగమోడీఁ గాక ఘాతలమదనుఁడు మదము రేఁచునట కాదని గెలువఁగఁ గలరాయెవ్వరు రాతిరిఁ బగలును నిన్నె జపించఁగ రతిఁ గైవస మయిన్యాఁ గాకా చ. నీ కల్పితమగు కర్మమంటు నట నెఱి విడిపించఁగ సమర్డు లెవ్వరు చేకొని నీవే గతి యని యుండఁగ చిక్కులఁ బెట్టుక చనుఁగాక యీకడ శ్రీవేంకటేశ్వర నీవే యెందుఁజూచినా నంతరాత్మ వట పైకొని నిన్నే నమ్మి వుండఁగాఁ బ్రసన్నుఁడవు నీ వయ్యెవుగాక పె.అ.రేకు:0058-03 బౌళి సంపుటము: 15-330 పల్లవి: కాదని వాదింప నోప కలఁగ నోప శ్రీదేవుఁడ నీవే దిక్కయి చేకొంటేఁ జాలును