పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

469 కల్లని మీ త్రివిక్రమాకారము చూపి మీరు చెల్లఁ బెట్టితిరి వేదశిఖలందు మరియు చ. ఆలకించి యహంబ్రహ్మమనెడి బుద్దుల చేత గాలిఁ బోయ భక్తి యల్లా కాలమందే యేలి ప్రహ్లాదునికిఁగా హిరణ్యకశిపు నొద్ద యేలికబంటువరుస లిందె చూపితిరి చ. అంతా నొక్కటియనే అధర్మవిధులచేత గుంతఁబడెఁ బుణ్యమెల్లాఁ గొల్లఁబోయి ఇంతట శ్రీవేంకటేశ యొక్కుడు నేనని కొండ వింతగాఁగఁ బొడవెక్కి విఱ్ఱవీఁగితివి రేకు: 0310-02 శ్రీరాగం సంపుటము:04-056 పల్లవి: కాకున్న మాపాటు కడమున్నదా నీకృపవంకనే నిలిచితిఁగాక చ. యీ నాలికేకాదా యిందరి నిందించినది శ్రీనిధి నిన్నుఁబొగడి చెలఁగెఁ గాక నానాపాపములు విన్న నా వీనులే కావా దానవారి నీ కథల ధన్యమాయఁగాక చ. యీ మేనేకాదా హేయపుటింతులఁ గూడె నీముద్రలు ధరియించి నిక్కెఁగాక యీ మనసే కాదా యిన్నిటిపైఁ బారినది కామించి నిన్నుఁ దలఁచి కట్టువడెఁ గాక చ. యీ పుట్టుగేకాదా హీనాధికములఁ బొందె వోపి నీ దాస్యము చేరి వొప్పెఁగాక యేపున శ్రీవేంకటేశ యిన్నినేరములు నాకుఁ బాపఁగా నే నిన్ను నమ్మి బ్రదికితిఁగాక రేకు:0063-05 శ్రీరాగం సంపుటము: 01-326 పల్లవి: కాకున్న సంసారగతులేల లోకకంటకములగు లోభంబులేల చ. వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికి వినికి చేసిన నదియె వేదాంతబోధ మనికిగనవలసినను మధువైరిపై భక్తి వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు చ. చదువు గనవలసినను శౌరినామము దిరుగఁ జదువుటే సకలశాస్త్రముల సమ్మతము నిదుర గనవలసినను నీరజాక్షునికిఁ దనహృదయసమర్పణ సేయుటిది యోగనిదుర చ. ఆస వలసిన వేంకటాధీశ్వరుని కృపకునాససేయుటే పరమానందసుఖము వాసి గనవలసినను వైష్ణవాగారంబు వాసి సేయుట తనకు వైభవస్ఫురణ పె.అ.రేకు : 0073-03 శుద్ధవసంతం సంపుటము: 15-419 పల్లవి: కాదని తొలఁగ రాదు కరుణించఁ బాడి నీకు వేదములు చాటి చెప్పే విశ్వవ్యాపకుఁడవు చ. కాచేనన్న చరమశోకము నాకుఁ బూఁట కాఁపు చూచి నీ వేడనుండినాఁ జూపి ఇచ్చీని