పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

468 అట్టె కర్మములనేటి అరిగోరులు వెట్టేము నుట్టుకొట్టి జీవులకు నరకము లేలయ్యా చ. మించిన పితాళ్లకు మేర లేలఁబెట్టేము పొంచి సంసారములలోఁగాఁపుర మున్నాము పంచేంద్రియపు పొలాలపైరు లెల్లాఁ జేసితిమి అంచె దేహులకెల్ల ఆజ్ఞలేడ వయ్యా చ. కూరిమి విషయముల కొట్నములు దంచేము చేరి నీచైతన్యమున సేవసేసేము యీతి శ్రీ వేంకటేశ యిటు నీకే దాసులము ఆరయఁ గాచితివి నీయాధీనులమయ్యా రేకు:0267-06 రామక్రియ సంపుటము: 03-388 పల్లవి: కాంతల మానమనేటి కరవట్నాలకు దిగె మంతనాన జీవుఁడనే మంచిమరకాఁడు చ. అరిది సంసారమనే యంబుధిలోనఁ దిరిగి వురుగతి దేహపుటోడమీఁద సరిఁ బాపపుణ్యముల సరకులు నించుకొని దరి చేరె జీవుఁడనే తలమరకాఁడు చ. కడలేని నిటూర్పుగాలి విసరఁగాను జడియుఁగోరికలనే చాపలెత్తి అడిబరవుగ మాయ అందునిండా నించుకొని యెడతాఁకె జీవుఁడనే యీమరకాఁడు చ. అలర శ్రీవేంకటేశుఁడని యేటిమాలిమి నలుదిక్కులకు నోడ నడపఁగాను ములిగె ధర్మార్ధకామమోక్షధనము గడించి పలుమాఱు జీవుఁడనే బలుమరకాఁడు రేకు:0041-01 ఆహరి సంపుటము: 01-249 పల్లవి: కాక మరి యింతేల కలుగుఁ దమకేతముకు చేకొన్న కోరికలు చేరు నందాఁకా చ. దొరతనములన్నియును దొరసి నందాఁకా నెరతనములన్నియును నెరపి నందాఁకా గరగలికలన్నియును కలసి నందాఁకా విరసంబులన్నియును విసుగు నందాఁకా చ. యెడమాటలన్నియును యెరసి నందాఁకా అడియూసకోరికలు అదుకు నందాఁకా జడిగొన్నగుక్కిళ్లు చవిగొన్నయందాఁక వొడ లోముటలు మోహ ముడుగు నందాఁకా చ. యీ వెల్లఁ దమయాత్మ యిచ్చగించినదాఁక శ్రీవేంకటేశుకృప చేరు నందాఁక లోవెలుతున్నియును లోఁగొన్నయందాఁక వేవేగ బంధములు వీడు నందాఁకా రేకు:0212-02 పాడి సంపుటము: 03-068 పల్లవి: కాకుంటే యీ శూన్యవాద కలినచిత్తుల చేత పైకొని వివేకులకు బ్రదుకఁగ వచ్చునా చ. అల్లనాఁడు నిరాకార మనెడి మాటలచేత వెల్లిఁబోయ లోకములో విజ్ఞానమెల్లా