పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

465 జిగి నింక నీకీబుద్ధి చెప్పనోపఁడా నిగిడి పుట్టించేటివాఁడు నిండుక వుండేటివాఁడు తెగని కర్మములెల్ల తిద్దకేల మానును చ. దనుజులఁ గొట్టేవాఁడు ధర్మము నిలిపేవాఁడు పనిగొన్న దురితాలు పాపనేరఁడా కొనమొదలైనవాఁడు గురి దానైనవాడు వునికి మనికి సేయకూరకుండీనా చ. స్వతంత్రుడైనవాఁడు స్వామియెనవాఁడు గతియై దాసులనెల్లఁ గానకుండీనా యితఁడే శ్రీవేంకటేశుఁ డిందిరాపలైనవాఁడు సతతము మాకు నిట్టే సంపద లొసఁగఁడా రేకు:0233-02 వరాళి సంపుటము: 03-187 పల్లవి: కలిమి గలిగియు నధమగతి యదేల బలిమి గలిగియు లోఁగి బతిమాలనేల చ. ఇలువేలుపొకఁడు హరి ఇంటనే వుండఁగా పలు వేలుపులతోడి భ్రమతలేల మెలఁగి సూర్యుఁ డొక్కఁడు మిక్కిలిని వెలుఁగఁగా వెల లేని దీపములు వేయి నేమిటికి చ. హరిభక్తి యొక్కటే ఆత్మలో నుండగా పరయుక్తులెంచేటి పనులేల సిరులఁ జింతామణటు చేతిలో నుండఁగా సరి గాజుఁబూస మెచ్చఁగ నదేమిటికి చ. నాలుకను మంచి పూలినామ మొుకటుOడగా గాలిఁ బోయెటి వూరగాధ లేల యీలీల శ్రీవేంకటేశుఁ డెదుటనె వుండగా మూలలకుఁ జేచాఁచి మొక్క నిఁకనేలా రేకు:0257-03 వరాళి సంపుటము: 03-328 పల్లవి: కలిమిలేములెల్లా కాలము స్వభావము తలఁపులో జ్ఞానము దక్కెడి దొకటే చ. పుట్టుగులు జీవునికి పూఁచిన స్వభావము వొట్టి యిదె సారెసారె వోమనేలా పట్టి నానాఁటి బ్రదుకు ప్రపంచము స్వభావము కొట్టగొన హరిముక్తి గోరెటిదొకటే చ. మక్కువ సంసారము మాయలస్వభావము చిక్కి కన్నవారికెల్లా మొక్కుకోనేలా తక్కక రక్షించేది దైవము స్వభావము నిక్కపు వైరాగ్యము నిలుచుట వొకటే చ. కప్పిన భోగములెల్లా కర్మము స్వభావము తప్పక ప్రియము చెప్పే దైన్యమేలా యెప్పుడు శ్రీవేంకటేశ యొదలో నాకుఁ గలవు చప్పుడు సేయక నీకు శరణనే దొకటే రేకు:0185-05 మాళవిగౌళ సంపుటము: 02-430 పల్లవి: కలియుగ మొటులైనాఁ గలదుగా నీకరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా చ. పాపమెంత గలిగినఁ బరిహరించేయందుకు