పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

466 నాపాలఁ గలదుగా నీనామము కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు చ. ధర నింద్రియూ లెంత తరముకాడిన నన్ను సరిఁ గావఁగద్దుగా నీ శరణాగతి గరిమఁ గర్మబంధాలు గట్టిన తాళ్ళు వూడించ నిరతిఁ గలదు గా నీ భక్తి నాకు చ. హితమైన యిహపరాలిష్టమైనవెల్లా నియ్య సతమై కలదుగా నీసంకీర్తన తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ గతి గలదుగా నీకమలాదేవి రేకు: 9086-02 ఆహరి సంపుటము: 04-591 పల్లవి: కలియుగంబునకుఁ గలదిదియే వెలసిన పంచమవేదమె కలిగె చ. బోధల హరినుతి పొడమెను శూద్ర స్సాధని కలిదోషము మాన్ప రాధా మూధవ రచన సకలజన సాధువేదమే జగమునఁ గలిగె చ. పరమగు వేదము బహుళము చదివియు హరి నెలిఁగిన వారరుదనుచు తిరువాముడియై దివ్యమంత్రమై వెలసిన పంచమ వేదమె కలిగె చ. బింకపు మనుజులు పెక్కులు చదివియు సంకె దీరదెచ్చట ననుచు సంకీర్తనమే సకలలోకముల వేంకటేశ్వరుని వేదమె కలిగె రేకు: 0184-04 గుండక్రియ సంపుటము: 02-424 పల్లవి: కలుగుట గలిగిననాఁడే నే ఘనపాపములకు దొలంగీనా యెలమి నే నిపుడే యెరిఁగితిని యిన్నాళ్లీమతిలేదు చ. జనియించిన నే నిటకమునుపు సకలయోనిగతజన్మములు కనుగొని యవె నే సారెకుఁ బలుమారు ఘనవర్ణాశ్రమధర్మములు అనుభవించినవే సకలార్ధంబులు అయిహికవిషయము లన్నియును మనసున వాకున శ్రీహరి నొకని నే మఱచియుఁ దలఁచుట లేదు చ. తిరిగినవే నే నాసలకొరకును దిక్కు లన్నియును నేను యిరవుగ తొల్లియు నెఱిఁగినవే యీ సంసారపు సుఖము లివి పొరలినవే నేఁ గామినీజనుల పొందుల సుఖముల భోగములు యెరవులదొకటే శ్రీహరిదాస్యం బిది గతియని యెరుఁగుటలేదు చ. గడియించినవే నేఁ బూర్వకాలమున ఘనమగు సంపద లిన్నియును నొడిగినవే నే శబ్దజాలములు నోరఁ గొలఁదు లివి యిన్నియును తలఁబడి నే నిటు సకలోపాయపు ధర్మము లిన్నియుఁ జూచితివి యెడపక శ్రీవేంకటేశ్వరు శరణం బిటువలెఁ జేరుటలేదు రేకు: 9080-02 పాడి సంపుటము: 04-582 పల్లవి: కలుషపు చీకటి గలుగఁగను వెలుగు లోకముల వెలసిన యట్లు చ. మునుకొని పాతకములు గలుగఁగఁబో