పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

464 జయ జయ కరుణాజలనిధి దయ యొఱంగ నే ధర్మము నెఱంగ నాక్రియ యిది నీ దివ్యకీర్తనమే చ. శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్ధన పరమ మెఱంగను భక్తి యొఱఁగను నిరతము నాగతి నీ దాస్యమే చ. నమో నారాయణ నమో లక్షీపతి నమో పుండరీకనయనా అమిత శ్రీవేంకటాధిప యిదె నా క్రమమెల్లను నీకయింకర్యమే రేకు: 0371-04 బౌళిరామక్రియ సంపుటము: 04-419 పల్లవి: కలిగె మాకిదె కైవల్యసారము ఫలించె నాడెదఁ బాడెద నేను చ. నీ పాద తీర్థము నీరజ భవుని పై పై కమండల పానీయము చేపట్టి శంభుని చిరు జడలలో దీపించు గంగా తీర్ధరాజము చ. ఘన నీ నామమె గౌరి నాలికపై పనిగొన్న మంత్రపాఠము అనుఁగువాణికి నాది చదువులఁ ఔనఁచే మొదలి బీజాక్షరము చ. శ్రీ వేంకటేశ్వర చేరి నీ దాసుల సేవ నా పాలిఁటి జీవనము ఆవిటించి శరణాగతులకును త్రోవంపైన దిదె దోషహరము రేకు: 0191-03 లలిత సంపుటము:02-464 పల్లవి: కలిగె మాకు నిది కైవల్యం కలకాలము హరికథాశ్రవణం చ. అచింత్య మద్భుత మానందం ప్రచురం దివ్యం పావనం సుచరిత్రం శ్రుతి శోభితం అచలంబిదివో హరికీర్తనం చ. నిరతం నిత్యం నిఖిల శుభకరం దులిత్రం పూర భవదూరం పరమ మంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం చ. సులభం సుకరం శోకనాశనం ఫలదO లలిత్రO భయపూరణO కలితం శ్రీవేంకటపతిశరణం జలజోదరనిచ్చ స్తోత్రం రేకు:0120-05 ఆహిరి సంపుటము: 02-119 పల్లవి: కలిదోషములాల కడు నేల మీరేరు యిలధరుఁ డుండగాను యిఁకనేఁటి ಮಿಯ್ಗಲು చ. జగములేలెడువాఁడు సర్వాంతరాత్ముఁడు