పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

463 ధరలోన దేవతలెందరైనాఁ గలుగనీ మురహరనామము ముంచి యొక్కటే యొక్కుడు యిరవైనమంత్రము లెన్నియైనా నుండనీ చ. గోవిందుదాసులే పెక్కువఘను లిందరిలో వేవేలు పెద్ద లటు వేలసంఖ్యలుండనీ కైవసపు విషుకైంకర్యమే సాధనము యీవలనావల పుణ్య మెంతైనాఁ గలుగనీ చ. పట్టినశ్రీవేంకటేశుభక్తి యొక్కటే ఘనము యిట్టే శాస్త్రజ్ఞాన మెట్లున్నాను వొట్టిన యాతని ముద్ర లొక్కటికి మూలము యెట్టిలాంఛనము లిల నెన్నియైనా నుండనీ రేకు:0262-03 సామంతం సంపుటము: 03-357 పల్లవి: కలిగిననాఁడే చుట్టరికంబులఁ దిరుగు నివి నలుగడ నివి సతమని మతి నమ్ముట పాపమయా చ. దేహము తోడనె పెరుగును తీరని యీఇంద్రియములు దేహము తోడనె ముదియును తేటతెల్లమిగను ఆ పుట్టనినాఁడును అంతము నోరెందిన నాఁడును శ్రీహరిమాయలఁ దగులుక జీవునిఁ దడవ వివి చ. తెలిశున్నపడే తగులును తియ్యని యీ సంసారము తెలివికిఁ బాసినయప్పడు దిగఁబడుఁ దా నెందో మలయక నిద్రించునప్పుడు మత్తుఁడై యున్నప్పుడు చలమరి జీవుని తోడుత సమ్మతమే లేదు చ. కన్నులు దెరచిన యప్పుడే కాన్పించును యీలోకము కన్నులు మూసినయప్పుడె కడగడఁ దా నణగు అన్నిట శ్రీవేంకటేశ్వరుఁ డాత్మను వెలిఁగెడివేళను వున్నతి జీవులఁ దగులవు వొదుగుచుఁ దిరుగు నివి రేకు: 9116-04 దేవగాంధారి సంపుటము:04-602 పల్లవి: కలిగినమతి వృథ గాకుండా అలరుటె పుణ్యంబగు ఫలము చ. ఒనరిన యూ భవము సురనకుOడ ఘనుఁడీ జీవుఁడు గలఫము తనువు మోచి చైతన్యాత్ముని మతిఁ గనుటె వివేకముగల ఫలము చ. చేసిన పుణ్యము చెడిపోకుండ శ్రీ సంపద మెరసిన ఫలము ఈసుల రేసుల యితర దూషణలఁ బాసుటె అపురూపపు ఫలము చ. హరిఁ గొలిచియు మిథ్య గాకుండ విరసముడిగి చదివిన ఫలము తిరు వేంకటగిరి దేవుని సరిగా పరుల( గొలువనిదే బహు ఫలము రేకు: 0191-05 లలిత సంపుటము: 02-466 పల్లవి: కలిగె నిదె నాకు కైవల్యము తొలుత నెవ్వరికి దొరకనిది చ. జయ పురుషోత్తమ జయ పీతాంబర