పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

462 మహిమ మీరఁగ హనుమంతురాయఁడు యిహమున రాము బంటై యిప్పుడూ నున్నవాఁడు అహరహరమును దొడ్డ హనుమంత రాయఁడు చ. నిండు నిధానపు లంక నిమిషాన నీరుసేసె మండిత మూరిత్రి హనుమంత రాయఁడు దండితో మగిడివచ్చి తగ సీత శిరోమణి అండ రఘపతి కిచ్చె హనుమంతరాయండు చ. వదలని ప్రతాపాన వాయుదేవు సుతుఁడై ముదిOుOచినాఁడు పూనుమOత్ర రాయుఁడు చెదరక యే పొద్దు శ్రీ వేంకటేశు వాకిటనదివో కాచుకున్నాఁడు హనుమంత రాయఁడు రేకు:0147-06 మాళవి సంపుటము:02-216 పల్లవి: కలశాపురముకాడఁ గాచుకున్నాఁడు వలసిన వరాలిచ్చీ వాయునందనుఁడు చ. మాయాబిలము చొచ్చి మగుడి యంబుధిలోని చాయాగ్రహముఁ జంపి చయ్యన దాఁటి ఆయెడ లంకిణిఁ గొట్టి యంతలో జానకిఁగని వాయువేగాన వచ్చిన వాయునందనుఁడు చ. కడలిదరినుండిన కపులతోఁ గూడికొని వడదీరఁగా మధువనము చొచ్చి బడి రామునికి సీతాపరిణామ మెల్లాఁ జెప్పె వడిగలవాఁడితఁడు వాయునందనుఁడు చ. రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి ఆవిభుని సీతఁ గూర్చి అయోధ్య నుంచె శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై వావిలి నిలుచున్నాఁడు వాయునందనుఁడు రేకు:0243-01 శంకరాభరణం సంపుటము: 03-242 పల్లవి: కలిగిన మీఁదాఁ గడమేలా పలులంపటములఁ బడుటే కాక చ. దురిత మణఁగె నిటు తుదకెక్కె సుఖము హరి యొక్కఁడె గతియన్నపుడే పొరి నిఁకఁ జేసెటి పుణ్యములెల్లా వరుసతోడ నెవ్వరికో కాని చ. సార మెరిఁగె తనజన్మము గెలిచెను శ్రీరమణునిఁ దలఁచినయపుడే సైరణతో నిఁకఁ జదివేటి చదువు మేరమీఁద నేమిటికో కాని చ. శ్రీవేంకటపతి చిత్తాన నిలిచెను కావించి గురునిఁ గన్నపుడే 2ూవిOచి యితరప్రార్ధన లన్నియు యినావలావలను యెందుకో కాని రేకు:0090–02 మలహరి సంపుటము: 01-442 పల్లవి: కలిగినది యొక్కటే కమలాపతిసేవ తెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను చ. హరియే పరతత్వ మతఁడొక్కఁడే గతి