పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

461 కడుగఁగడుగ రోరింపి కలియుగమూ బడలికె వాపవుసరమేదో చూపవు గడిచీటియును నీవు కలియుగమూ చ. కరపేపు కఱతలే మఱపేవు మమతలే కరకఱ విడువవు కలియుగమూ తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు గరునేల దాఁటేవో కలియుగమా చ. కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు కానీలే కానీలే కలియుగమూ పైనిదే వేంకటపతి దాసులుండఁగ కానవా నీ విదేమి కలియుగమా రేకు:0272-01 దేసాక్షి సంపుటము: 03-412 పల్లవి: కలవి రెండే భూమి కామనిధానంబులు జలజాక్షుఁడు నతని శరణాగతియును చ. నరులు లేరా భూమి నానాదిక్కులలోన హరిదాసుఁడొక్కఁడే యరుదుఁ గాక సురలు లేరా మింట సోదించ ఘనుఁ డొక్కఁడే పరమపదమేలు శ్రీపతియే కాక చ. మాటలు లేవా భూమి మంత్రము లెంచి చూడఁగ తేటల హరినామమే తేఁకువఁ గాక కోటిపూజ లిల లేవా కుమతులు సేసేవి పాటల ప్రపన్నుని భక్తి దొడుఁ గాక చ. విహితసుఖము లేదా విశ్వములో భోగించ సహజమోక్షసుఖమే సారముఁ గాక యిహమున శ్రీవేంకటేశుఁడిందరికి లేఁడా మహి శ్రీవైష్ణవులకే మనికాయఁ గాక రేకు:0290-04 పాడి సంపుటము: 03-521 పల్లవి: కలశాపురము కాడ గంధపు మాకుల నీడ నలరేవు మేలు మేలు హనుమంతరాయ చ. సంజీవికొండ దెచ్చి సౌమిత్రి బ్రతికించితి భంజించిత్రి వసురుల బలువిడిని కంజాప్తకుల రాఘవుని మెప్పించితివి అంజనీతనయ వో హనుమంతరాయ చ. లంక సాధించితివి నీ లావులెల్లాఁ జూపితివి కొంకక రాముని సీతఁ గూరిచితివి లంకెల సుగ్రీవునికి లలిఁ బ్రధాని వైతివి అంకెలెల్లాఁ నీకుఁ జెల్లె హనుమంతరాయ చ. దిక్కులు గెలిచితివి ధీరతఁ బూజ గొంటివి మిక్కిలి ప్రతాపాన మెరసితివి ఇక్కువతో శ్రీవేంకటేశ్వరు బంట వైతివి అక్కజపు మహిమల హనుమంతరాయ రేకు: 0380-04 సామంతం సంపుటము: 04-467 పల్లవి: కలశాపురముకాడ కందువ సేసుకొని అలరుచు నున్నపాఁడు హనుమంత రాయుఁడు చ. సహజాన నొక జంగ చాఁచి సముద్రము దాఁటె