పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

460 చ. కమలాక్ష నీవు మాకుఁ గలిగియుండఁగ భూమి నమరలేని దొకటి నవ్వల లేదు నెమకి నాలుకమీఁద నీ నామము మెలఁగఁగ తమితోఁ బరుల వేఁడఁ దాఁ జోటులేదు చ. శౌరి నీ చక్రము నాభుజముమీఁద నుండఁగాను యీరసపుఁబగ లేదు యెదురూ లేదు చేరువ నీసేవ నాచేతులపై నుండఁగాను తీరని కర్మపువెట్టి దినమూ లేదు చ. అచ్చుత నీపై భక్తి యాతుమలో నుండఁగాను రచ్చలఁ బుట్టిన యపరాధమూ లేదు నిచ్చలు శ్రీవేంకటేశ నీ శరణాగతుండఁగా విచ్చిన విడే కాని విచారమే లేదు రేకు: 0345-05 పాడి సంపుటము:04-266 పల్లవి: కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ CᏇᏇᏫᎧ నేనెట్టుండినాను యెంచకుమీ నేరమి చ. మనసులోనికి గురి మాధవ నీ పాదాలు తనువుపై గురి నీ సుదర్శనము కనుచూపులకు గురి కమలాక్ష నీ రూపు పను లెన్నిగలిగినఁ బట్టకు నా నేరమి చ. చేతులు రెంటికి గురి సేసేటి నీ పూజలు నీతి నా నాలికగురి నీ నామము కాతరపునుదుటికిఁ గల తిరుమణి గురి పాతకపు నావలనఁ బట్టకుమీ నేరము చ. యిహపరాలకు గురి యీ నీ శరణాగతి సహజ మాత్మకు గురి సంతతభక్తి మహిలో శ్రీవేంకటేశ మన్నించి నన్నేలితివి బహువిధముల నింకఁ బట్టకుమీ నేరమి రేకు:0296-06 ముఖారి సంపుటము: 03-559 పల్లవి: కలలోన నిట్లనే కాఁపురము నిట్లనే నిలువు గల్లందమో నిజమందమో చ. వొక్కనాటి ప్రపంచము వొక్కనాటివలె రాదు వొక్క నిమిషమువలె నొకటి గాదు పక్కన మాయమైపోవు బడిబడినే వచ్చు నెక్కొని కల్లందమో నిజమందమో చ. పొద్దు వొడచేది గొంత పొద్దు గూఁకేది గొంత చద్ది గొంత వేఁడి గొంత చవులు గొంత వొద్దనే కాలమునుండు వుండుండీ దవ్వయిపోవు నిద్దపుఁ గల్లందమో నిజమందమో చ. పాపపుణ్యాలంటెనంటాఁ బాయపు సుఖదుఃఖాలు పైపై ననుభవించఁ బరసిపోవు యే పొద్దు శ్రీవేంకటేశుఁ డెదలోనే వున్నాఁడు యేపునఁ గల్లందమో యిది(???) నిజమందమో రేకు:0019-06 సామంతం సంపుటము: 01-118 పల్లవి: కలలోని సుఖమే కలియుగమా,వెన్న కలిలో నెక్కడిదె కలియుగమా చ. కడిగడి గండమై కాలము గడపేవు