పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

459 నిలిపతిమా నేము నిమ్మకు బులుసు చ. యెంత సేసినా యిహమున జీవికి చెంత నజుఁడు వ్రాసిన కొలఁదే వంతల ముంటికి వాఁడి వెట్టితిమూ కొంతతీపు చెఱకుకుఁ జల్లితిమా చ. ఘనముగ బుద్దులు గఱపిన దేహికి మును నోఁచిన నోముఫలంటే నినుపుఁ దెంకాయకు నీరు నించితిమా వొనర వేమునఁ జేఁదు నిచితిమా చ. యిరవుగ శ్రీవేంకటేశుఁడే ప్రాణికి కెరలి భాగ్య మొసఁగినయంతే మరువమునకు బరిమళము సేసితిమా పెరిగేటి యడవులు పెంచితిమా రేకు:0146-01 శంకరాభరణం సంపుటము: 02-206 పల్లవి: కలది యీమూర్తివల్ల గతి గనవలెను యిల నిందు నమ్మకుంటే యెందు మరి లేదు చ. కంటిమా బ్రహ్మమును వేంకటపతిఁ గనినట్టు కంటిమూ అవతారాలు కత్రలె కాక కంటిమా హృదయములోఁ గలిగిన దైవమును కంటిమా వైకుంఠముకడవారైనాను చ. తెలిసీనా జ్ఞానము యీ దేవుని మహిమవలె తెలిసీనా వేదాలు సందేహమే కాక తెలిసీనా మాయ యిది యెంత చదివినా తెలిసీనా ముందరితెరువు వెదకితే చ. చిక్కీనా మనసు యీశ్రీవేంకటేశ్వరువలె చిక్కీనా ధ్యానము వట్టిచింతలేకాక చిక్కీనా అనాదినుండి చిగిరించీ కాలము చిక్కీనా పెద్దలు చెప్పే జితమైన శాంతి రేకు:0104-04 గుజ్జరి సంపుటము:02-022 పల్లవి: కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మానునా మలసి కామ్యకర్మములకుఁజొచ్చిన మగుడఁ బుట్టువులు మానునా చ. పరగ నింద్రజిత్తుఁడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబునఁ గట్టి అరయ నందుపై మోకులు గట్టిన నలబ్రహ్మాస్త్రము వదలె పరిపరివిధముల నిటువలెనే హరిఁ బ్రపత్తి నమ్మిన నరుఁడు తిరుగఁ గర్మమార్గమునకుఁ జొచ్చిన దేవుఁడు దనవాత్సల్యము వదలు చ. అలరిన సంసారభ్రమ విడిచి యడవిలోన జడభరతుఁడు తలఁపుచు నొకయిట్టిఁ బెంచినంతనే తనకును నారూపు దగిలె ములుగుచు లంపటములు దెగ విడిచి మోక్షము వెదకెడి నరుఁడు వలవని దుస్సంగతులు పెంచినను వాసన లంటక మానునా చ. అటుగన తాఁ బట్టిన వ్రత ముండఁగ నన్యమతము చేపట్టినను నటనల నెందునుఁ బొందక జీవుఁడు నడుమనె మోరుఁడైనట్లు తటుకస శ్రీవేంకటపతి నొక్కని దాస్యము భజియించిన నరుఁడు ఘటనల నాతని కైంకర్యములకు కడు(బాత్రుఁడు గాక మానునా రేకు:0292-02 దేవగాంధారి సంపుటము: 03-531 పల్లవి: కలదు తిరుమంత్రము కల దిహముఁ బరము కలిమి గలుగు మాకుఁ గడమే లేదు