పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

458 యిలదైవమా నాకెన్నఁడో నిశ్చయము చ. గుట్టుతో వైరాగ్యమే కోరుదు నేనొకవేళ అట్టున సంసారపుటాఱడి గోరుదు ముట్టుపడి యొకచోట మనసెందు నిలువదు యిట్టె చెంచెలుఁడ నాకు నెన్నఁడో నిశ్చయము చ. కొంతవడి నే సత్త్వగుణమందు నెలకొందు అంతలో రాజస గుణినై యుందును చెంత దామసగుణము చేకొందు నొకవేళ యింత పలువంచలు నా కెన్నఁడో నిశ్చయము చ. వివరించి యొకవేళ వివేకివలె నుందు ఆవల మూడుఁడనవుదు నంతటిలోనే తవిలి శ్రీ వేంకటేశ తగ నిన్నుదలఁచంగ యవలఁ దొల్లేయాయ నెన్నఁడో నిశ్చయము పె.అ.రేకు:0015–02 మలహరి సంపుటము: 15-082 పల్లవి: కలకాలము యిందుఁ గల దింతె హరిఁ దలఁపులోఁ దలఁచని తప్పె కలిగి చ. ఎన్నిలేవు పనులు యెంచుకొని సేసేమంటే పన్నిన జంత్రముల యీ ప్రాణికి యిన్నిటాఁ దొల్లేమి గంటి మింకాఁ గనే దేమి అన్నిటా దురాశల ఆలపే కలిగె చ. లంపటి మెంత లేదు లలిఁ గట్టుకొనే మంటే తెంపుల తెఱఁగులేని దేహికిని యింఠాల నిన్నాళ్లాయ యీ పాటెన్వరి కెక్కే జంపుల మాయలలోని సటలే కలిగె చ. యెంత యెడ లేదు యింత కీ సంసారములోన మంతనపుఁ గోలికలు మనుజునికి యింత్రలోనే శ్రీవేంకటేశునిఁ గొలిచి తేను సంతోసము లెల్లఁ జేరి జయమే కలిగె రేకు:0277-05 లలిత సంపుటము: 03-446 పల్లవి: కలదందే పో సర్వముఁ గలదు కామితార్ధమునుఁ గలదు కలదు గలదు శరణాగతులకు హరికైంకర్యంబున మోక్షము గలదు చ. ఆకాశంబున మోక్షము వెదకిన నందులోపలా లేదు పైకొని తానెంత వెదకి చూచినా పాతాళంబున లేదు యీకడ ధరలో మూలమూలలను యెందు వెదకినా లేదు శ్రీకాంతుని మతిఁ జింతించి యాసలఁ జిక్కక తొలఁగిన నందే కలదు చ. కోటిజన్మములు యెత్తిన ముక్తికి కొన మొదలేమియుఁ గనరాదు వాటపు సంసారములోఁ గరపువార్థి యీఁదినాఁగనరాదు కూటువతో స్వర్గాది లోకములఁగోరి వెదకినాఁగనరాదు గాఁటపు కేశవభక్తి గలిగితే కైవల్యము మతిఁ గానఁగవచ్చు చ. సకలశాస్త్రములు చదివినాఁ బరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలువేల్పుల నెందరిఁ గడువెదకి కొలిచినా దొరకదు అకలంకుఁడు శ్రీవేంకటగిరిపతి అంతరంగమున నున్నాఁడనుచును ప్రకటముగా గురుఁ డానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకు రేకు:0091-04 లలిత సంపుటము: 01-450 పల్లవి: కలది గలట్టే కర్మఫలంబులు