పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

456 కర్మము ధర్మము నీ కల్పితమే కాదా చ. బ్రతుకు మంటేఁ జచ్చిన పరీక్షిత్తు బ్రతుకఁడా మతి నారాయణాస్త్రము మానుమంటే మానదా కతలుగా జలధులు కమ్మంటే రాళ్ళు గావా యితవు నీకు నైతే యేపని యైనా నౌను చ. మలసి బ్రహ్మ మాయకు మారుమాయ సేయవా అల ద్రౌపదికిఁ జీర లక్షయ మంటేఁ గావా కులగిరులు నేలతో కుంగు మంటేఁ గుంగవా యిల నీకు వలసితే యేపనియైనా నౌను చ. యిట్టిది విధి యనరా దిది యాంగా దనరాదు పట్టి నీవు దలఁచిన యట్టాఁగాన యిట్టే శ్రీ వేంకటేశ యిందరిలోననుఁ గావు యెట్టు నీకు వలసిన యేపనియైనా నాకు రేకు: 0366-03 కాంబోది సంపుటము: 04-389 పల్లవి: కర్మ మెంత మర్మ మెంత కలిగిన కాలమందు ధర్మమిది యేమరక తలఁచవో మనసా చ. చెలువల పొంతనుంటే చిత్తమే చెదురుఁగాని కలుగనేర దెంతైనా ఘన విరతి వులుక కర్గి పొంతనుంటేఁగాఁకలేకాక చలువ గలుగునా సంసారులకును చ. బంగారువోడ గంటేఁ బట్టనాస వుట్టుఁగాని సంగత్రి విజ్ఞానపు జాడకు రాదు వెంగలి యఖిని దింటే వెఱి వెeూటాడుఁగాక అంగవించునా వివేక మప్పడే లోకులకు చ. శ్రీ వేంకటేశు భక్తి చేరితే సౌఖ్యముగాని ఆవల నంటవు పాపా లతి దుఃఖాలు చేవ నమృతము గొంటే చిరజీవియగుఁగాని చావులేదు నోవులేదు సర్వజ్ఞలకును రేకు: 0332-05 దేశాక్షి సంపుటము:04-188 పల్లవి: కర్మమూలము జగము గాదనివిడువక మర్మపుమోక్షము లేదు మానలేరో గర్వము చ. సకలకర్మాలు మాని సన్యాసి యైతేను వొకట వెలితిలేనివున్నతుండట ముకెమై వుభయకర్మములు బంధ హేతువని ప్రకటించి వేదాంతపఠనమే యొక్కుడు చ. బహురూపములు మరచి బ్రహ్మ నిషుఁడైనయోగి యిహపరముల కతఁడెక్కుడట విహితకర్మము దక్క వీరఘటోరకర్మములు సహజపాతకమనేశాస్త్రాలే యొక్కుడు చ. సంతతకర్మములెల్ల సంసారమూలములు అంతట నిస్సంగుడైతే నధికుఁడట చింతించి చింతించి శ్రీవేంకటేశ్వరు వంతుకుఁజెప్పన హరివాక్యమే యొక్కుడు రేకు: 0343-06 నాదరామక్రియ సంపుటము: 04-255 పల్లవి: కలఁడా యింతటి దాత కమలనాభుఁడేకాక