పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

455 హరి నిన్ను గొలువక యలసీఁ బ్రాణి చ. కలలో నింతులఁ గలసినట్లనే వెలిఁ గాంతలతోడి వేడుకలు లలి నిందుకుఁగా లంపటములఁబడి పలుమారు నూరక బడలీఁ బ్రాణి చ. నిన్నటి యాహార నిజరుచివలెనే అన్నువ నిప్పటి యాహారము యొన్న నిందుకే యిడుమలఁ బొరలుచు కన్న గతులఁ గడుఁ గలఁగీఁ బ్రాణి చ. పరుసముసారీఁకినబంగారమువలె పరమభాగవతపట్టములు అరయఁగ శ్రీ వేంకటాధిప నీకృప యిరవుగఁ గని తుదకెక్కీఁబ్రాణి పె.అ.రేకు:0001-03 బేళి సంపుటము: 15-003 పల్లవి: కరుణించి నీవు గాఁగాఁ గాచితివి గాక శరణని విన్నవించ సంగతులా నాకు చ. దిట్టనై నేఁ జేసిన దిమ్మరిచేఁతలకును జట్టిగా నీ నరకాలు చాలునా నాకు పుట్టిన నా జన్మములు పొసగఁగ వ్రాయఁబోతే అట్టె వనముల తాటియాకు లెల్లాఁ జాలునా చ. కదిసి నే నాడేటి కల్ల లెంచి చూచితేను మొదల యీ భూమియైనా మోచునా నన్ను ఆదన నే నాచరించే అనాచారపు టెంగిలి నదులజలాలు పావనము సేయఁగలవా చ. తొలుత నేఁ దలఁచిన ద్రోహాలకు మాఁకు లెల్లా యిలఁ గొఱులు సేసినా యిందుఁ బాయునా అలరి మరి దిక్కు లేరని శ్రీవేంకటేశ్వర తెలిసి నీవే నాకు దిక్కె కాచితివి రేకు:0106-04 లలిత సంపుటము:02-034 పల్లవి: కరుణించు మిఁకనైన కాఁపురమా కరికరిఁ బెట్టుకుమీ కాపురమా చ. కలలోని సుఖమైన కాఁపురమా కలుషమే చవియైన కాఁపురమా కలను బేహారపు కాఁపురమా కలఁడు మా కిదే హరి కాంపురమా చ. గంట వేఁటలో తగులు కాఁపురమా కంట వత్తివెట్టి కాచే కాఁపురమా గంటుగిందుగాఁ బొరలే కాఁపురమా కంటిమి శ్రీపతికృప కాఁపురమా చ. కావిరి వెట్టి చేరాయి కాపురమా కావలసినట్లయ్యే కాఁపురమా శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్ను నన్ను నొక్కకైవశము సేసెఁగదో కాఁపురమా పె.అ.రేకు:0002-01 మాళవిగౌళ సంపుటము: 15-008 పల్లవి: కర్మ మంటా మాకు మాయ గప్పేవు గాక