పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

454 శరణాగత వజ్రపంజరుఁడవు నీవు చ. మన్నించేనంటే నిన్ను మానిపేవా రెవ్వరు పన్ని కోపగించితే నీపట్టుకెదు రెవ్వరు చెన్నుమీర నీపెట్టుజెట్లే జీవులెల్లాను వన్నెగా నీసొమ్ము నీవువలసినట్టు సేయి చ. కాచేనంటే నిన్నుఁ గాదనేవా రెవ్వరు ఏచి యాజ్ఞవెట్టేనంటే యిదేలనేవా రెవ్వరు లాచి పెంపుడుగుఱ్ఱలు లలినీజీవులెల్లాను చేచేత నీదాసులను సేసినట్టు సేయి చ. పరమిచ్చేనంటే నడ్డపడేవా రెవ్వరు సరి నిహమిచ్చేనంటే సాధించేవా రెవ్వరు సిరుల శ్రీవేంకటేశ చేతిలోవారము నీకు పూలి నీపాఁతవారమెట్టెనా దయసేయి రేకు:0182-02 బౌళి సంపుటము:02-410 పల్లవి: కరుణానిధివి గాన కాచితేనేమో కాని సరికి బేసికి నిన్ను జరయఁ జోటున్నదా చ. కాయములోపలి నిన్నుఁ గని మని కొలువక ఆయపుఁగర్మమె బ్రహ్మ మని వుంటిని చీయని నాచేఁతకు నే సిగ్గువడుండుట గాక ఆయమేమైనా నిన్ను నడుగఁ జోటున్నదా చ. సకలచైతన్యుఁడవై సరి నాలో నుండఁగాను వికటపు విషయూలవెంటఁ బారిత్రి వొకరు రక్షించఁగా వేరొకరిపాలైన నాకు తుకతుకలేకాక దూరఁగఁ జోటున్నదా చ. పట్టి శ్రీవేంకటగిరిఁ బ్రత్యక్షమై యుండఁగాను ఇటు నటుపై వైకుంఠ మేల కోరేను దిట్టనై నానేరమి నే తెలిసి నవ్వుట యింతే ఇట్టె నీచిత్తము గాక యెంచఁగఁ జోటున్నదా పె.అ.రేకు:0029-01 గుజ్జరి సంపుటము: 15-165 పల్లవి: కరుణానిధివిగాఁగ కాచేవు గాక యిరవై నావంటివాని కిది యసంగతము చ. నేర నే పుణ్యము సేయ నిత్యానిత్య మెఱిఁగి నేరుతు రిత్తచేతుల నీకు మొక్కేది యేరీతిం బరమిచ్చేవొ యేమి గలదు నాయందు కారణములేని యీవి కడు ననంగతము చ. లేదు విజ్ఞానము గొంత లేశమైన నాయందు సాదించఁ గదొకటి మీ శరణనేది ఆదిగొని నన్నుఁ బాయ వంతరాత్మవై నీవు వీదరవెల్లి పొందులు విన ననంగతము చ. కాను నే నరుహుఁడను కదిసి పనులకు నే నవుదు నొకటికి నిన్నుఁ బాడను యీ నెపాన శ్రీ వేంకటేశ నన్ను నేలితివి దానికిఁ దగ్గంతె కాక దాఁట ననంగతము రేకు: 0365-01 హిందోళం సంపుటము: 04-381 పల్లవి: కరుణించవే నిజగతి బోధించవే