పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

453 పల్లవి: కమ్మరను జీవునికిని ఇది కారణ మేమియు లేదట ఇమ్మల రాజూ నెరగని వెట్టెట యెవ్వరికెక్కును నారాయణా చ. యిలలో జీవుని విషయభోగమున నెందునుఁ బొరయునివాఁడవట చలమా యేల పుట్టించితివీ సంసారవారిధిని కలకాలము నీగర్బగోళమునఁ గాఁపురముండఁగ నిటు చేసి ఫలమేమి గట్టుకొంటివి భావము దెలుపవే నారాయణా చ. నడపెడి యీ జగములన్నియును నటనలు నీవట తొలుతనే యెడయక యిందే వినోదించెదవు యొడ్డతనంబా నీకేమి జడియక నీవే సేసిన చేఁతలు సర్వమును నిలుపఁగవలదా కడుగఁగనేఁటికి నెంగిలిబూరెట కడవేయనేల (?) నారాయణా చ. పరగిన యీ కర్మమార్గములు బంధ హేతువని చెప్పితివి యిరవుగను వేదమార్గములు నేలా కాచుక తిరిగెదవు గరిమల శ్రీవేంకటేశ్వర యిచ్చాకల్పితములు యిన్నియు నీకు హరినెరిగించితివిఁక నీచిత్తము సర్వేశ్వర వో నారాయణా రేకు:0238-06 బైరవి సంపుటము: 03-221 పల్లవి: కరుణానిధి నీవే కనుఁగొంచునున్నాఁడవు యిరవై నాలో నున్నాఁడ వేది గతి యిఁకను చ. పేరుచున్నవి నాలోనఁ బెక్కు వికారములు వూరుచున్నవెన్నెనా వూహలెల్లాను చేరుచున్నవొక్కొక్కటే సేనాసేనకోరికలు యీరీతి నున్నాఁడ నాకు నేది గతి యిఁకను చ. పట్టుచున్నవి నానాప్రకృతుల వోజలు పుట్టుచున్నవి యనేకభోగేచ్ఛలు చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు యిట్టివి నానడతలు యేది గతి యిఁకను చ. సందడింపుచున్నవి సారెకు నా మమతలు ముందువెనకై వున్నవి మోహాలెల్లా చెందె నీపై భక్తి నేఁడు శ్రీవేంకటేశ్వర యెందునూ నీవే కాక యేది గతి యిఁకను రేకు: 0066-03 కన్నడగౌళ సంపుటము: 01-342 పల్లవి: కరుణానిధిం గధాదరం శరణాగతవత్సలం భజే చ. శుకవరదం కౌస్తుభాభరణం ఆకారణప్రియ మనేకదం సకలరక్షకం జయాధికం సే - వకపాలకమేవం భజే చ. వురగశయనO మహోజ్ఞలం తం గరుడారూఢం కమనీయం పరమపదేశం పరమం భవ్యం హరిం ధనుజభయదం భజే చ. లంకాపూరణO లక్షీరమణం పంకజ సంభవ భవప్రియO వేంకటేశం వేదనిలయం శు. భాంకం లోకమయం భజే రేకు:0352-03 హిందోళం సంపుటము: 04-305 పల్లవి: కరుణానిధివి గట్టుకో యేపుణ్యమైన