పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

452 పల్లవి: కప్పరమునకుఁ గప్పరమై చిప్పిలుఁదావి మించె నితఁడు చ. బంగారమునకు బంగారమై శృంగార మమరే శ్రీ హరికి అంగమయిన మొల పీతాంబరంబున కొంగు బంగారై కూడె నితఁడు చ. తట్టు పుణుఁగునకుఁ దట్టు పుణుఁగయి ఘట్టిమేన మించెఁగా యుత్రఁడు నెట్టన నొసల నిండిన కస్తురి బొట్టు చెమటతోఁ బొలెనికత్రcడు చ. పన్నీట పాదాన పన్నీరే తానయి యిన్నిట శ్రీ వేంకటేశుఁడిదే ఉన్నత్రి జలధి నుదయమున కన్నియు కౌఁగిట ఘనుఁడితఁడు రేకు:0154-04 కేదారగెళ సంపుటము: 02-255 పల్లవి: కమలారమణ నీకల్పితపుమానిసిని తమితోడ నాదిక్కు దయఁ జూడవే చ. ఆరీతి బ్రాహ్మణుఁడ ననుటేకాని దేహము కోరి యూచారమునకుఁ గొలుపదు పేరు వైష్ణవుఁడననే పెద్దరికమే కాని సారమైన మనసులో జ్ఞానమే లేదు చ. చదివితిననియెడి చలపాద మింతే కాని అదన నందులోని అర్థ మెఱఁగ పదిరిసంసారమనే బహురూపమే కాని చతురుఁదనాన నOదు సమరుఁడఁ గాను చ. దేవ మీభక్తుఁడననే తేజ మొకటె కాని చేవమీర నినుఁ బూజించ నేరను శ్రీవేంకటేశ నీచేతిలోనివాఁడ నేను భావించి మఱి యేపాపము నెఱఁగను రేకు:0188-03 చాయానాట సంపుటము: 02-446 పల్లవి: కమ్మంటేఁ గావా కాఁగల వన్నియు చిమ్ముల మాయలు సేయఁగనేలా చ. సరసిజాక్ష నీసంకల్పమాత్రము అరుదగు ఘనబ్రహ్మాండ మిది అరయంగ ధరలో నల్పపుఁ బనులకు హరి యవతారం బందితివేలా చ. సతత సురాసుర జననమరణములు మతి నీహుంకారమాత్రములు గతియై యమృతము గల్పించుకొరకును తతి ఘనోరజలధి దచ్చితివేలా చ. యి వైకుంఠము యీశేషగిరే మహి నీ దర్శనమాత్ర మిది విహరింపఁగ శ్రీవేంకటేశ యిటు బహులోకపు కల్పనలవి యేలా రేకు: 0245-04 బౌళి సంపుటము: 03-257