పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

451 పల్లవి: కన్నులపండుగ లాయఁ గడపరాయని తేరు మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు చ. కదలెఁ గదలెనదే గరుడధ్వజుని తేరు పొదిగి దేవదుందుభులు మైూయఁగా పదివేలు సూర్యబింబము లుదయించినట్లు పొదలి మెరుపు వచ్చి పొడచూపినట్లు చ. వచ్చెవచ్చెనంత నింత వాసుదేవుని తేరు అచ్చుగ దేవకామిను లాడిపాడఁగా ముచ్చటతో గరుడఁడు ముందట నిలిచినట్టు మెచ్చుల మెరుఁగులతో మేఘము వాలినట్టు చ. తిరిగెఁ దిరిగెనదె దేవదేవో త్తము తేరు వరుస దేవతలెల్ల జయవెట్టగా విరివిఁ గడపలో శ్రీవేంకటేశుఁడు తేరుపై నిరవాయు సింహాసన మిదేయన్నట్లు రేకు:0174-03 బౌళి సంపుటము:02-364 పల్లవి: కన్నులపండుగలాయ కమ్మి సేవించేవారికి సన్నల నీదాసులము సంతసించేము చ. పడఁతు లిద్దరు నీపాదములు వొత్తఁగాను కొడుకు బ్రహ్మదేవుఁడు కొలువఁగాను కడుపులో లోకములు కడు జయవెట్టఁగాను గుడిగొనె నీబ్రదుకు గోవిందరాజా చ. మొత్తఁగా శేషుఁడు నీకు మించుఁబరపై వుండగా జొత్తు మధుకైటభులు సుక్కి వోడఁగా హత్తి దేవతలు నిన్ను నందరుఁ బూజించఁగాను కొత్తలాయ నీబ్రదుకు గోవిందరాజా చ. పరగి నీముందరను పంచబేరము లుండఁగా గరిమc జక్రము నీకుఁ గా పై వుండఁగా తిరమై శ్రీవేంకటాద్రి తిరుపతిలోపలను గొరబాయ నీబ్రదుకు గోవిందరాజా రేకు: 0331-01 ఆందోళి సంపుటము: 04–178 పల్లవి: కన్నులపండుగలాయఁ గన్నవారి కిందరికి వెన్నుఁడేఁగీ నిల్లిదివో వీధుల వీధులను చ. అదె యెక్కెఁ దిరుతేరు అసురలు బెదరఁగ త్రిదశులు చెలఁగఁగ దేవదేవుఁడు కదలె బండికండు ఘనమైన మైూఁతతోడ వెదచలుఁ గాంతులతో వీధుల వీధులను చ. తోలి యాడీఁ దిరుతేరు దుషులెల్ల నణఁగఁగ చాలుకొని శిషులెల్ల జయవెట్టఁగ గాలికిఁ బడగలెల్లాఁ గడు నల్లాడఁగఁ జొచ్చె వేలేటి పువుదండలతో వీధుల వీధులను చ. తావు చేరెఁ దిరుతేరు ధర్మములు నిలువఁగ యీవల నలమేల్మంగ ఇచ్చగించఁగా శ్రీవేంకటేశ్వరుఁడు శింగారాలు మొరసెను వేవేలు విధముల వీధుల వీధులను రేకు: 9019-01 శ్రీరాగం సంపుటము: 04-538