పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

450 పల్లవి: కన్నవారివద్ద నెల్లఁగావంగనేమిగద్దు యిన్నిటికి నియ్యఁగొన నీతఁడే స్వతంత్రుఁడు చ. పరిమేష్టిగన్నతండ్రిఁ బాటించి కొలువరో అరుదై లోకాలకెల్ల నతఁడే తండ్రి సిరిమగఁడైనవానిఁ జేపట్టి తలఁచరో సిరులిచ్చేమేఁటిదాత సృష్టికెల్ల నతఁడే చ. అంబరీషుఁ గావఁ జక్రమంపినవానిఁ జేరరో అంబుజభవాండాన కతఁడే రక్ష పంబిన భూకాంతపతిఁ బాయక సేవించరో వుంబళ్లు వూళ్లు నిచ్చేవున్నతుఁడు నతఁడే చ. మూలమంటేఁ గరిఁగాచేముఖ్యునికి మొక్కరో మూలధనమైయుండీ ముందర నిట్టె యీలీలఁ జిత్తజుతండ్రి నెదలోనఁ గొలువరో పాలించ శ్రీవేంకటాద్రిపతియాయ నితఁడే రేకు:0217-01 దేసాక్షి సంపుటము: 03-090 పల్లవి: కన్నవిన్నవారెల్లా కాకు సేయరా వున్నతుఁడవైన నీకీ వొచ్చములేలయ్యా చ. దేవతలఁ గాచినట్టి దేవుఁడ నీకుఁ బసుల నీవలఁ గాచితివనే హీనమేలా కావించి పాలజలధిఁగాఁపురముండినయట్టినీవు పాలదొంగవనే నింద నీకేలయ్యా చ. కాలమందు బలి దైత్యుఁ గట్టివేసినట్టి నీకు రోలఁగట్టువడినట్టి రోఁత నీ కేల పోలించి లోకాలకెల్ల పొడవైన దేవుఁడవు బాలుఁడవై రేపల్లెలోఁ బారాడనేలయ్యా చ. పాముమీఁదఁ బవ్వళించి పాయకుండినట్టి నీకు పాముతల దొక్కినట్టి పగలేలా కామించి శ్రీవేంకటాద్రి కడపరాయఁడ నీవు భూమి మాయలణఁచి నేర్పుల మాయలేలయ్యా రేకు: 0369-03 లలిత సంపుటము:04-406 పల్లవి: కన్ను లెదుటిదే ఘన వైకుంఠము వెన్నుని గొలిచిన విజ్ఞానికిని చ. తలఁచినదెల్లాఁ దత్వ రహస్యమే తెలిసిన యోగికి దినదినము పలికినవెల్లా పరమ మంత్రములె ఫలియించిన హరి భక్తునికి చ. పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే పుట్టుగు గెలిచిన పుణ్యునికి మెట్టినదెల్లా మిన్నేటినిధులే అట్టడితెగువ మెఱయు వానికిని చ. వినినవియల్లా వేదాంతములే ఘనుఁడగు శరణాగతునికిని యెనసిన శ్రీ వేంకటేశుఁడే యింతా కొనకెక్కిన నిజ కోవిదునికిని రేకు:0217-04 సాళంగనాట సంపుటము: 03-093