పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

449 పల్లవి: కనుఁగొననిది హరి కల్పితము తనకు నిందులోఁ దగినంతే చ. నానాభేదములు నరుల గుణంబులు నానారుచులివి నవపదార్ధములు ఔననేదేది యుటు గాదనేదేది వానివాని విధి వలసినయట్టు చ. నడచుఁ బ్రపంచము నడుపే విధముల నడచు మాయ లెన్నఁగరావు విడిచేటివేఁటివి విడువనివేఁటివి పడఁగఁబడఁగ నవి పరచినయట్లు చ. తెగని కర్మములు దేహధర్మములు తెగని యూసలివె దినదినము తగు శ్రీవేంకటదైవము దాసులు నగుదు రిన్నిటిని నటనలు చూచి రేకు:0255-05 బౌళి సంపుటము: 03-318 పల్లవి: కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో నన్నుం గానను నిన్నుం గానను నడుము బట్టబయలు చ. నీమాయమహిమో నే నేరని కడమో భూమిలోన నీవున్నాఁడవు నా పుట్టుగులుఁ గలవు యేమి గాఁగలనో యింకా మీఁదట నిటకతొల్లి యేమైతినో సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను నేను చ. జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో నీనామంబులు అనంతకోట్లు నిలుకడగాఁ గాను కానఁగల యీ ప్రపంచమెలా కలయో యిది నిజమో కానరాని యీ ముక్కున నూర్పులు కాలముఁ గొలచేటి కుంచములు చ. నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యుని నమ్మితినో కైకొని నాయంతర్యామివి నినుఁ గంటినిపుడే నేను శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వర శ్రీవైకుంఠమే యీజగము యేకడ చూచిన నీదాసులు నాయెదుటనే వున్నారు పె.అ.రేకు:0058-01 దేపాళం సంపుటము: 15-328 పల్లవి: కన్నవారి కెల్లా నేల కలుగు వైష్ణవము వెన్నుని నమ్మగవలె వీరవైష్ణవునకు చ. పరగఁ బాపముఁ గంటే భయము నొందఁగవలె నరయ సంసారమందు నరుచి వుట్టఁగవలె విరివి భోగములందు వెసటు వుట్టఁగవలె విరతి గలుగవలె వీరవైష్ణవునకు చ. తలపోసి సుజ్ఞానము ధనమని వుండవలె పొలసి తన నేరా లెప్పుడుఁ దలఁచఁగవలె కలకాల మాచార్యుఁడే గతి యని యుండవలె వెలిఁగోరకుండవలె వీరవైష్ణవునకు చ. ఘనమోక్ష మార్గమందు కడు రుచి గల్గవలె పెనఁగీ భాగవతులు ప్రేమ గలుగఁగవలె తనర శ్రీవేంకటేశుదాసుడై బ్రదుకవలె వినయము గల్లవలె వీరవైష్ణవునకు రేకు: 0341-01 భూపాళం సంపుటము:04-238