పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

448 పల్లవి: కనియెడి దిదియే వినియెడి దిదియే కడలఁ జదివెడి దిదియపా8 నినుపు నీరై సర్వజగముల నిలిచె శ్రీహరిమాయ చ. తలఁపు నొక్కటే తాను నొక్కఁడే దైవ మొక్కఁడే పో కలిసి పెక్కుముఖంబులై లోకంబు దోఁచెనేని తెలియఁ జిల్లుల కడవ లోపలి దీపమువలెనే అలరి వెలిఁగెడి చూడఁజూడఁగ హరిప్రపంచపు మాయ చ. దేహ మొక్కటే జీవుఁ డొక్కఁడే దినము నొక్కటేపో మోహ జాగ్రత్వప్ననిద్రలు మొనపె భేదములై వూహఁ బెక్కులయద్దముల చంద్రోదయమువలెను సాహసంబున భ్రమలఁబెట్టెడి చదల నిదె హరిమాయ చ. గురువు నొక్కఁడే మంత్ర మొక్కటే కొలువు నొక్కటేపో అరయ భక్తియ వేరు వేరై యలరుచున్న దిదే గరిమ శ్రీవేంకటగిరీశ్వరు కల్పితమువలెనే వెరసి వారికి వారికే ఇది వింతవో హరిమాయ రేకు: 9080-01 ముఖారి సంపుటము: 04-581 పల్లవి: కనుఁగాక పుణ్యాలు కడఁబడెనా తనువు లేదో చేతనము లేదో చ. మోసపోతినననేల మురుగ వగవనేల చేసుఁగాక పుణ్యాలు చీము దుమ్మెనా దాసుఁడుఁగాదా లేఁడొ తలఁప శ్రీహరి లేఁడొ వీసమంతగాలమైన విధిలేదో చ. తల్లడించి పడనేల దైవము దూరనేల చెల్లఁబో నేఁడే పండి పొల్లవోయెనా ఉల్లములో హరి లేఁడో ఒద్దికతోఁ దా లేఁడో కొల్లలాడఁ బుణ్యములకోరిక లేదో చ. చచ్చి చచ్చి పుట్టనేల జముబారిఁ బడనేల నొచ్చి నొచ్చి మరుచేత నొగులనేల యిచ్చలేదొ తిరువేంకటేశుఁడొద్దనె లేఁడో నిచ్చ నిచ్చఁ దనకింత నేరుపు లేదో రేకు:0062-04 శ్రీరాగం సంపుటము: 01-319 పల్లవి: కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగినను ఆనవరతవిభవంబు లప్పుడే రావా చ. విసుగ కెవ్వరినైన వేఁడనేర్చన నోరు దెసలకును బలుమారుఁ దెరచు నోరు వసుధాకళత్రుఁ దడవదుగాక తడవినను యెసఁగఁ గోరికలు తన కిప్పడే రావా చ. ముదమంది యెవ్వరికి మైుక్కనేర్చిన చేయి పొదిగి యధముల నడుగఁబూను చేయి ఆదన హరిఁ బూజసేయదుగాక సేసినను యెదురెదురఁగోరికలు యిప్పుడే రావా చ. తడయకేమిటికైనఁ దమకమందెడి మనసు ఆడరి యేమిటికైన నలయు మనసు వడి వేంకటేశుఁ గొలువదుగాక కొలిచినను బడిబడినె చెడనిసంపద లిటు రావా రేకు:0296-02 శుద్ధవసంతం సంపుటము:03-555