పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

447 రేకు:0083-06 భూపాళం సంపుటము: 01-404 పల్లవి: కనియు గానని మనసు కడమగాక యెనలేని హరిమహిమ కిది గుఱుతుగాదా చ. కనుకలిగి హరిగొలిచి ఘనులైరిగాక మును మునుజులే కారా మహరుషులును మనసులో నిపుడైన మరిగి కొలిచినవారు ఘనులౌట కిదియ నిక్కపు గుఱుతుగాదా చ. భావించి హరిఁగొలిచి పదవులందిరిగాక జీవులే కారా దేవతలును కావించి కొలిచినను ఘనపదవు లేమరుదు యేవలన నిందిరికి నిది గుఱుతుగాదా చ. పన్ని హరిఁగొలిచి నేర్పరులైరి గాక ధర నున్నవారే కారా యోగివరులు యెన్నికల శ్రీవేంకటేశు నమ్మినవార లిన్నియునుఁ జేకొనుట కిది గుఱుతుగాదా రేకు:0248-06 బౌళి సంపుటము: 03-277 పల్లవి: కనియుఁ గానరు నీమహిమ కౌరవకంసజరాసంధాదులు మనుజులు దనుజులఁ జంపిరనఁగ విని మరి నీ శరణము చొరవలదా చ. పుక్కిటనే లోకములు చూపితి పూతకి చన్నటు దాగితివి పక్కననే బండి దన్ని విరిచితివి బాలులు సేసేటి పనులివియా అక్కరతో తృణావర్తు నణఁచితివి ఆఁబోతుల కీటణఁచితివి చిక్కించి యనలము చేత మింగితి శిశువులు సేసేటి పనులివియా చ. తొడిఁబడ మద్దులు భువిపై గూలఁగదొబ్బియఘాసురుఁ జంపితివి బడినే గోవర్ధనగిరి యెత్తితి పడుచులు సేసేటి పనులివియా అడరి బ్రహ్మమాయకుఁ బ్రతిమాయలు అట్టే గడించి నిలిచితివి పిడికిట చాణూరు నేనుగఁ గొట్టితి పిన్నలు సేసేటి పనులివియా చ. కాళింగుని మద మణఁచి దవ్వగా కడగడలకుఁ బోఁజోఁపితివి గోలవై యజ్ఞఫలము లిచ్చితివి గోవాళు సేసేటి పనులివియా యీలీల శ్రీవేంకటాద్రిమీఁదనే యిందరికిని పొడచూపితివి బేలుదనంబుల నెంచిచూడ పసిబిడ్డలు సేసేటి పనులివియా రేకు:0199-06 దేసాక్షి సంపుటము:02-513 పల్లవి: కనియుండి భ్రమసితిఁ గట్టా నేను యెనలేక గురియైతి నిట్టే నేను చ. తోలునెముకలు గట్టి దొరనంటా మురిసేను అలుబిడ్డల మరఁగు ఆహా నేను గాలి యూటించుకొని కాలములు గడపేను వోలిఁ బుణ్యపాపమందు వోహో నేను చ. మంటివంక బదుకుతా మదియించి మురిసేను ఇంటిముంగిటనే వుండి యీహీ నేను వొంటివాఁడనై వుండి వూరఁగలవెల్లాఁ గోరే వొంటిన యాసల తోడ నూహూ నేను చ. నూలికోకఁ గట్టువడి నున్ననై నే మురిసేను యీలాగు నాబదుకెల్ల యేహే నేను పాలించి శ్రీవేంకటాద్రిపతి నాకుఁ గలుగఁగ ఆలరినై గెలిచితి హై హై నేను రేకు: 0320-04 బౌళి సంపుటము:04-115