పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

446 రేకు:0221-06 బౌళి సంపుటము: 03-119 పల్లవి: కనకము కనకమే కడు నినుమినుమే వెనక సరిదూఁగితే వెలువకురాదు చ. హరిఁ గొలిచినవారి కమరు నన్నిసుఖాలు గరిమతో వారల భాగ్యమే భాగ్యము తెరమరఁగుల కర్మదేహులెల్ల వీరితోడ పురుఁడు వెట్టుకోఁబోతే పోలికలు రావు చ. భాగవతులైనవారు పట్టినదెల్లా నీడేరు చేగదేర వారలు సేసినదే చేఁత్ర తీగెసంసారమత్తులు తెలియక వీరివలె వేగినంతా నయ్యేమంటే వెరవులఁ బడవు (?) చ. శ్రీవేంకటేశుదాసులు చేసినదెల్లా సృష్టి యేవంకా ధ్రువపట్టమే ఇటు వారికి కావరపు మనుజులు గతిగనేమని వారితోవల నడవఁబోతేఁ దూగదు తమకును రేకు:0232-06 శంకరాభరణం సంపుటము: 03-185 పల్లవి: కని గుడ్డును నదె విని చెవుడును నిదె ననిచి జగత్తు నడచీనదివో చ. వుదయాస్తమయము లొకదినముననే యెదుటనె వున్నవి యెంచినను యిదివో జీవులు యెంచక తమతమ బ్రదుకులు సతమని భ్రమ సెదరు చ. వెలుఁగును జీఁకటి వెసఁ గనుఁగొనలనె నిలిచీ నూరక నిమిషములో కలవలెనుండిన గత్రి సంసారము బలువుగ సతమని భ్రమ సెదరు చ. కాంతలుఁ బురుషులు కాయ మొక్కటనె పొంతనే పుట్టుచుఁ బొదలెదరు యింతయు శ్రీవేంకటేశ్వరు మహిమలఁ పంతము దెలియక భ్రమ సెదరు రేకు:0099-02 బౌళి సంపుటము: 01-496 పల్లవి: కనినవాండాఁ గాను కాననివాఁడాఁ గాను పొనిఁగి వొరులకైతే బోధించే నేను చ. ధరణిఁ గర్మము గొంత తగినజనము గొంత సరికి సరే కాని నిశ్చయము లేదు వొరిమె యెంచిచూచితే నొకటివాఁడాఁగాను సరవి దెలియ కేమో చదివేము నేము చ. యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంత చేతులు రెండు చాఁచే చిక్కుట లేదు యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను కాతరాన కతలెల్లా గఱచితి నేను చ. దైవిక మొకకొంత తగుమానుషము గొంత చేవలుచిగురువలెఁ జేసేను యీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గా చె భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను