పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

445 రేకు: 9087-01 శ్రీరాగం సంపుటము: 04-592 పల్లవి: కత్తరాలు చిమ్ముచుండెఁ గదలుచుండె చిత్తజ జనకుఁడైన శ్రీ మూరితి చ. కన్నులఁ జొక్కుచునుండె కంపితము మీఁటుచుండె సన్నపు సాలపు నిగ్గు సళుపుచుండె అన్నువ నడిమి యింతి నక్కున నొత్తుచునుండె ఉన్నతిఁ గోనేటిదరినున్న మూరితి చ. మేసులు ముట్టుచునుండె మేడమీఁద నిలుచుండె కీసిన గోక గిలిగింపుచునుండె నేసకొప్పరమణికి చెక్కులు నొక్కుచునుండె తీసిన లంఘితముల దివ్యమూరితి చ. కిలకిల నవ్వుచుండె కిన్నెర వట్టుచునుండె పలుమెరుఁగులు దోఁప బాడుచుండె అలమేలుమంగమీఁద నలరి యొురగి యుండె వెలయ వేంకటగిరి వేదమూరిత్రి రేకు: 0306-02 నాట సంపుటము:04-032 పల్లవి: కదిరి నృసింహుఁడు కంభమున వెడలె విదితముగా సేవించరొ మునులు చ. ఫాలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములును కాల రౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరియించుక నిలిచె చ. ముడివడు బొమ్మలు ముంచిన వూర్పులు గడగడ నదరెటి కటములును నిడుద నాలికెయు నిక్కుఁ గర్ణములునడియాలపు రూపై తా వెలసె చ. సకలాయుధములు సహస్ర భుజములు వికట నఖుOబులు వెCస బూని వెకలి యగుచు శ్రీ వేంకటేశ్వరుఁడె ప్రకటపు దుషుల భంజించె నిదివో రేకు: 0376-04 శంకరాభరణం సంపుటము: 04-445 పల్లవి: కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక అదె యూతనికె శరణంటే నంటి నేను చ. యెవ్వని వుదరమున నిన్నిలోకములుండు యెవ్వని పాదము మోచె నిల యలను యెవ్వఁడు రక్షకుఁ డాయ నీ జంతుకోట్లకు అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు చ. సభలో ద్రౌపదిఁ గాచె సర్వేశుఁ డెవ్వఁడు అభయహస్త మొసంగె నాతఁ డెవ్వఁడు ఇభవరదుఁడెవ్వఁడు యీతనికే వొడిగట్టి అభినవముగ శరణంటే నంటి నిప్పుడు చ. శరణుచొచ్చిన విభీషణుఁ గాచె నెవ్వఁడు అరిది యజునితండ్రి యూతఁ డెవ్వఁడు యిరవై శ్రీ వేంకటాద్రి యొక్కి నాతం డితఁడే ఆరసి యితనికే శరణంటే నంటి నిప్పుడు