పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

444 రేకు:0270-03 సామంతం సంపుటము: 03-403 పల్లవి: కడుపు నిండె నిఁకఁ గడమేది మును తడవినయపుడే నే ధన్యుఁడనైతి చ. హరిహరి యని నే నన్ననాఁడె నా పరగిన జన్మము ఫలియించె కెరలి మీఁద మిక్కిలి నీ సేవలు వరుస జలధిలో వానలు చ. ముందర నీకును మొక్కినయపుడే అOదితిఁ దుది పదమగు సుఖము పొందుగ మీఁదటి వేవేలు సేవలు యెందును శ్రీమంతు కిచ్చిన సిరులు చ. శ్రీవేంకటపతి శరణనినపుడే దైవము నాపాల దక్కితివి చేవలఁ గమ్మర సేవించు సేవలు వేవేలు పూజల వేడుకలు రేకు: 0049-05 గుండక్రియ సంపుటము: 01-302 పల్లవి: కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికై పడనిపాట్ల నెల్లఁబడి పొరలనేలా చ. పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయఁ బరితాపకరమైనబ్రదుకేలా సారిది నితరుల మేలుచూచి సైఁపఁగలేక తిరుగుచుండేటి కష్ట దేహమిదియేలా చ. యెదిరి కెప్పుడుఁ జేయు.హితమెల్లఁ దనదనుచు చదివిచెప్పనియట్టి చదువేలా పొదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబు సదమదంబై పడయుచవులు దనకేలా చ. శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాక జీవనభ్రాంతిఁ బడుసిరులేలా దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు_ త్రోవ లేఁగిన దేహి దొరతనంటేలా పె.అ.రేకు:0021-06 సామంతం సంపుటము: 15-122 పల్లవి: కత గాదు దృష్ట మిది కలిగె మాకు సతమంటా నిట్టె ఫాదు జరపఁగవలసె చ. కాయమనేటి మోహినీగజ మెక్కినారము పాయవుమోహమదము పట్టెను మమ్ము తీయరాని బందుపు తీగె తెంచివేయ లేము యేయెడ విజ్ఞాన మిఁక యెఱిఁగేమా మేము చ. విచ్చల సంసారమునేనిథి దొక్కినారము పచ్చి మదనభూతము పట్టెను మమ్మ గచ్చుల యహంకారగర్వము మానఁగ లేము అచ్చపు మోక్షపుతెరు వజ్బీనా మాకు చ. రామలరతి కొల్లాపురము చొచ్చినారము యేమైనా యెగ్గు సిగ్గు లెంచము నేము శ్రీమంతుఁడై నట్టి శ్రీ వేంకటేశుఁడే నన్ను యేమరి యుండఁగ మమ్ము యేలినాఁడు వీఁడెవో