పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

443 పల్లవి: కడు నజ్ఞానపు కరవుకాలమిదె వెడలదొబ్బి మా వెరపు దీర్చవే చ. పాపపు పసురము బందెలు మేయఁగ పాపుల పుణ్యము పొలివోయ శ్రీపతి నీకే చేయి చాఁచెదము యేపున మమ్మిఁక నీడేర్చవే చ. యులఁ గలియుగమును యుOడలు గాయఁగ చెలఁగి ధర్మమను చెరు వింకె పొలసి మీ కృపాంబుధి చేరితి మిదె తెలిసి నాదాహము తీర్చవే చ. వడిగొని మనసిజవాయువు విసరఁగ పారెడవగు నెఱుకలు పుట మెగసె బడి శ్రీవేంకటపతి నీ శరణము విడువక చొచ్చితి వెసఁ గావఁగదే రేకు:0025-04 గుండక్రియ సంపుటము: 01-152 పల్లవి: కడుఁ జOచలములు కడునధ్రువములు కడు నల్పములని కాదందురు చ. కర్మభోధ వికారంబులు ధర్మతంత్ర సంధానములు దుర్మదైక సందోహములు కర్మదూరు లివి గాదందురు చ. పరమభాగవత భవ్యమతులు పరమభోధ సంభావకులు తిరువేంకటగిరిదేవు సేవకులు కరుణా8)కు లివి గాదOదురు రేకు:0041-03 ముఖారి సంపుటము: 01-251 పల్లవి: కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల కడలేని జన్మసాగర మీఁదనేల చ. దురితంబునకు నెల్లదొడవు మమకారంబు_ లలిదిమమతలకుఁ దొడ వడియూసలు గురుతయిన యూసలకుఁ గోలికలు జీవనము పరగ నిన్నిటికి లంపటమె కారణము చ. తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ_ ముదుటయిన తాపమున కుండఁగఁ జోటు పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ మదము పెంపునకుఁ దనమనసు కారణము చ. వెలయఁ దనమనసునకు వేంకటేశుఁడు గర్త బలిసి యూతనిఁ దలఁచుపనికిఁ దాఁ గర్త తలకొన్న తలఁపు లివి దైవమానుషముగాఁ దలఁచి యాత్మేశ్వరునిఁ దలంపంగ వలదా