పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

442 వొడలి రోఁతలు చూచి వూరకైనా నవ్వును చ. ఆఱడిఁ బాము గరచినట్టివాఁడు దినఁబోతే జాఱని వేఁప చేఁదైనాఁ జప్పనై తోఁచు వీఱిడై సంసారపువిష మెక్కినవానికి చూఱలై హేయకాంతలు సుఖములై తోఁచును చ. చెంగట వెట్టివానికి చేసిన చేఁతలెల్ల తొంగలించి వివేకాలై తోఁచినట్లు మింగుచుఁ గర్మపు నాము మేసిన సంసారికి అంగడి కర్మమే బ్రహ్మమై తోఁచును చ. జగమిది యొక్కటే చవులు వేరేవేరే మొగి నెఱుకమఱపు ముడిచున్నది పగటు శ్రీవేంకటేశుఁ బట్టి కొలువనివాఁడు తెగని మాయలలోనఁ దేలాడవలసె రేకు:0036-07 శుద్దవసంతం సంపుటము:01-226 పల్లవి: కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు కడలేని మనసునకుఁ గడమ యొక్కడిది చ. దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు దేహంబుగలయన్ని దినములకుఁ బదార్థమోహమేలుడుగు దా ముదమేల కలుగు చ. ముంద రెలిఁగిన వెనుక మొదలు మరచెదనన్న ముంద రేమెరుఁగుఁ దా మొదలేల మరచు అందముగఁ దిరువేంకటాద్రీశు మన్ననల కఁదువెరిఁగినమేలు కలనైన లేదు రేకు:0286-03 ముఖారి సంపుటము: 03-496 పల్లవి: కడవ రాదు హరి ఘనమాయ తెగి విడువఁగరాదు వేసరరాదు చ. చూపుల యెదిటికి సోద్యంబైనది పాపపుణ్యముల ప్రపంచము తీపులు పుట్టించు దినదిన రుచులై పూపల సంసారభోగములు చ. మనసు లోపలికి మర్మంబైనది జననమరణముల శరీరము వెనవెనకఁ దిరుగు వెడ లంపటమై కనకపుటాసల కర్మములు చ. తగు మోక్షమునకుఁ దాపంటైన దిదె నగి హలిఁ దలఁచిన నాలుకిది వెగటు దీరె శ్రీవేంకటపతియై యగపడె నిపుడు పురాకృతము రేకు:0204-01 లలిత సంపుటము: 03-019