పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

439 గావు వట్టితివిగా కలికాలమా చ. పట్టభద్రుల నతులు పలుమారు నింద

  • * * * * * * * * * * * * * * * రిపెంబులై దీనులైరి దిట్టెనఁ దిరువేంకటేశుదాసులు నిన్నుఁ గట్టవేతురు సుమీ కలికాలమా రేకు: 0039-03 సామంతం సంపుటము: 01-239 పల్లవి: కటకటా యిటుచేసెఁ గర్మబాధ

యెటువంటివారికిని నెడయు దీబాధ చ. దినదినముఁ బ్రాణులకు దీపనముచే బాధ తను పోషణములు కందర్పబాధ మనసు శాంతికి సదా మమకారముల బాధ తనివోనికోర్కులకు దైవగతిబాధ చ. వెడయాసచూపులకు వేడుకలచే బాధ కడువేడ్కలకు వియోగములబాధ తొడవైనయెఱుకలకు దురితబుద్దులబాధ జడియుఁబరచింతలకు సంసారబాధ చ. ఆరిది నిశ్చయమతికి ననుమానములబాధ సరిలేని జీవులకు జన్మబాధ తిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచువెరవుచేతనె కాని వీడ దీబాధ రేకు: 0333–06 శుద్ధవసంతం సంపుటము:04-195 పల్లవి: కటకటా యీ ప్రాణి గతిగనుట యెన్నఁడో అటు నావశము గాదు హరి నీచేఁ గాని చ. పాపము నెరుఁగుదు బOధము నెరుఁగుదు మాపుదాకా నివి నేను మానలేఁగాని కోపము దురుణమని కొంత గొంత యెరుఁగుదు తీపుల యాసలఁ బడి తిప్పలేఁగాని చ. చూతును దుఃఖాలవారిఁ జూతును బుట్టేవారి యీతల నాకు వెరపు యించుక లేదు గాతల నామనసెల్లఁ గల్పించినట్లవును చేతనైనా చెప్పినట్టు సేయలేఁగాని చ. నావంకఁ గడమ గాఁక నా గురుఁడు తొల్లె నన్ను శ్రీవేంకటేశుఁడ నీచేతికిచ్చెను దైవమొక్కఁడవే నీ దాసానుదాసుఁడనైతి యేవిధులు నే నెరఁగ నిటు నిన్నేకాని పె.అ.రేకు:0077-03 లలిత సంపుటము: 15-443 పల్లవి: కటకటా యీ యాత్మ లేగతి నీడేరఁగలరు