పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

440 యిటు నీకు శరణంటే యిట్టే రక్షింతువు చ. చేరి నీ మహిమ చిరజీవుల నడిగే మంటే ఆ రీతి జీవులు బ్రహ్మాదిదేవత లింతే వారఁ దమపుట్టిన యవ్వలగాని తొల్లింటి నీ రూప మింతింతని నిశ్చయింప లేరు చ. అందరికి శ్రుతులే ఆధార మనాదినుండి పొందుగా నడిగే మంటే పొడచూప వదియును కందువ ఋషులపాఠక్రమముల వచ్చె నింతే అందరియర్ధములు నిశ్చయము సేయ లేరు చ. అదిగాన యోంచి సనకాదులు శుకాదులును మొదలనే నినుఁ గొల్చి ముక్తులనిపించుకొనిరి అదనఁ దక్కిన వుపాయముల నింత వున్నదా పదిల మలమేల్మంగపతి శ్రీవేంకటేశా రేకు:0214-01 ధన్నాసి సంపుటము: 03-079 పల్లవి: కటకటా యేమిటాను కడవర గానఁడిదే నిటలపు వ్రాఁత యెట్లో నిజము దెలియదు చ. బాదల సంసారము పరవంజుకొని తొల్లి యేది నమ్మి పాటువడె నీ జీవుఁడు గాదెల కొలుచుగాఁగఁ గట్టుకొని కర్మములు యేదెస చొచ్చీనో కాని యీ ప్రాణి చ. కాఁపురమై తమ తల్లి కడుపున వచ్చి పుట్టె యే పని గలిగెనో యూ దేహి కాపాడీ నిక్షేపాలు కడునాసతోఁ బాఁతి యే పదవిఁ దానుండునో యీ జంతువు చ. దవ్వుల యమబాదలు దలఁచి వెరవఁడిదె యెవ్వరి సలిగెనమ్మోయీ జీవి రవ్వగా శ్రీవేంకటాద్రిరాయఁడు మన్నించంగాను యివ్వల బతికెఁగాక యెవ్వఁడోయి తాను రేకు:0282-02 రామక్రియ సంపుటము: 03-471 పల్లవి: కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ చ. వేదములే శిలలై వెలసినది కొండ యేదెసఁ బుణ్యరాసులే యేరులైనది కొండ గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ శ్రీదేవుఁడుండేటి శేషాద్రి యీ కొండ చ. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విఁ దపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపు టంజనాద్రి యీ పాండవాటి కొండ చ. వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ పరగు లక్షీకాంత్రు సాశీబనపుఁ గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దిదివో శ్రీవేంకటపుఁ గొండ రేకు:0042-06 పాడి సంపుటము: 01-260 పల్లవి: కడగనుటే సౌఖ్యముగాక యీ