పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

436 జడియక పేగులు జందెంబులుగా మెడఁ దగిలించుక మెరసీ వాఁడే చ. పెదవులు చింపుచు పెనుగోళ్ల నదిమి వుదుటుఁ బునుక గొరికుమియుచును సదరపు గుండెలు చప్పరింపుచును మెదడు గందముగ మెత్తీ వాఁడే చ. దేవతల భయము దీర్చి యంకమున శ్రీవనితనుఁ గృప సేయుచును పావనపు టహారోబలగిరి దైవము శ్రీవేంకటగిరిఁ జెలఁగీ వాఁడే రేకు: 0324-01 భవుళి సంపుటము:04-136 పల్లవి: కటకట నేమూ కర్తలము గాము ఘటన శ్రీపతి నీవే కావఁగదవయ్యా చ. పుడమిఁ బుట్టితిమి ಬುದ್ದಿ నెలిఁగిత్రిమి కడుపే చెరువవుత గానమయ్యా వొడలు మోఁచితిమి వున్నతిఁ బెరగితిమి వెడఁ జిల్లులఁ గారేది విడిపించ లేవయ్యా చ. నిన్న నిద్రించితిమి నేఁడే మేలుకొంటిమి తిన్న వెల్లఁ దీరినటే తెలియమయ్యా కన్నులఁ జూచితిమి కమ్మర మూసితిమి వున్నచే నుండదు మతి పూరట లేదయ్యా చ. సరిఁ జదివితిమి శాస్త్రముఁ జూచితిమి గురుఁడే రక్షకుడౌత గురుతెనయ్యా నిరతి శ్రీనేంకటేశ నిన్నే నమ్మితిమి పరదైవములతోడిపని మాకు లేదయ్యా రేకు:0317-01 మలహరి సంపుటము: 04-096 పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో ఘటనల హరికృప గలిగినఁగాక చ. యురవగుజీవుల కెంతగలిగినా పరధనకాంతలే బలుప్రియము ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా సారది( బాపమే సులభము చ. నానారుచులు యనంతము గలిగిన కానిపదార్ధమె కడుఁ దీపు పానిన చదువుల పఠన లుండగా మానని దుర్బాషమాఁటలే హితవు చ. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ సదరపు దివిజులు చవులయిరి అదనను శ్రీగురుయానతి గలుగఁగ పారిదిగిరెని యివి త్రలపాశీయుఁగ వలెస్సె రేకు: 0354-02 గుండక్రియ సంపుటము: 04-316 పల్లవి: కటకట హరిమాయాకల్పనెట్టిదో తటుకునఁ బారవేసేతలఁపెందు లేదు చ. అనంతకోటియుగాదులనుండియు త్రనివోక విషయాలఁ దగిలుండినా