పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

435 తిరమై వీరి పాదతీర్థమే విరజానది సారిది నన్ని చోట్లు చూచినట్టే వున్నది చ. మిచ్చక వైష్ణవుల మాటలెల్లా వేదములు యిచ్చల నిందుకంటే నింక లేదు అచ్చట వీరిపస్తాద మమృతపానములు అచ్చమై తెలిసేవారి కఱచేత నున్నది చ. చెలఁగి ప్రపన్నుల సేవే విజ్ఞానము ఫల మిందుకంటే మణి పైపై లేదు తలఁప శ్రీవేంకటేశుదాసులే యాతనిరూపులెలమి నెదుట నున్నా రెఱిఁగినవారికి రేకు: 9016-03 బౌళి సంపుటము: 04-536 పల్లవి: కందర్పజనక గరుడగమన నందగోపాత్మజ నమో నమో చ. వారిధి శయన వామన శ్రీధర నారసింహ కృష్ణ నమో నమో నీరజ నాభ నిగమ గోచర నారాయణ పూలి నమో నమో చ. పరమ పురుషా భవ విమోచన వరద వసుధావధూవర కరుణా కాంతా కాళిందీ రమణ నరసఖ శౌరీ నమో నమో చ. దానవ దమన దామోదర శశి భాను నయన బల భద్రానుజ దీన రక్షక శ్రీ తిరు వేంకటేశ నానా గుణమయు నమో నమో పె.అ.రేకు:0063-02 రామక్రియసంపుటము: 15-359 పల్లవి: కంబములో వెడలితివి కరిరాజుఁ గాచితివి పంచి యిన్నిటా నీ కిది పనియటే శ్రీహరీ చ. యెవ్వఁడూ మొఱవెట్టునో యిట్టె రక్షించే ననుచు యెవ్వఁడూ ననుఁబేర్కొనునో యింతటాఁ బలికేననుచు యెవ్వఁడూ మదిఁ దలఁచునో యిక్కువఁ బొడచూపేననుచు వువ్విళూరఁ గాచుకొని వుందు వటే శ్రీహరీ చ. ఆపన్నుఁడు శరణంటే నడ్డము వచ్చే ననుచు యేపొద్దు ధ్యానించువానికి యెదుట నుండే ననుచు పై పైఁ బూజించేవానికి పాదములు చాఁచే ననుచు వోపి యెప్పుడు గాచుకొని వుందు వటే శ్రీహరీ చ. అడిగి బొగడేవానికి నప్పుడే నొసంగే ననుచు చిడిముడి నీ దాసునికి చెప్పినట్టు సేసే ననుచు బడినే శ్రీవేంకటేశ భక్తి సేసే వానికిని వుడివోక కాచుకొని వుందు వటే శ్రీహరీ రేకు:0288-01 నాట సంపుటము: 03-506 పల్లవి: కంభమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుఁ గూలిచెను చ. తొడికి దైత్యుఁ దన తొడపైకిఁ దిగిచి కడుపు చించి రక్తము చల్లి