పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

434 వాదపుగర్వము లేదు వట్టియాచారము లేదు సాదించి నైచ్యానుసంధానమే కాని చ. మిమ్ముఁ దలపుచుఁ జేయు మృగయానంపైన మేలు సామ్ముపోక మీకుఁగాని సుకృతము సేయుకంటె దిమ్మరిజన్మము లేదు తెగనికోరిక లేదు పమ్మి నీపైఁ బెట్టినట్టి భారమేకాని చ. దిక్కులు సాధించుకంటె తెలిసి శ్రీవేంకటేశు దిక్కు నీనామమే కా సాధించుటే మేలు యొక్కువ తక్కువ లేదు యెఱు కెఱఁగమి లేదు చక్కజాడతో నీకు శరణంటేఁగాని రేకు: 0192-03 సాళంగనాట సంపుటము: 02-470 పల్లవి: కంటిరా వింటిరా కమలనాభుని శక్తి వొంటి నితని శరణ మొకటే వుపాయము చ. యీతని నాభిఁ బొడమె యొక్కువైన బ్రహ్మయు యీతఁడే రక్షించినాఁడు యింద్రాదుల యీతఁడాకుమీఁదఁ దేలె నేకార్ణవమునాఁడు యీతఁడే పో హరి మనకిందరికి దైవము చ. యీతఁడే యసురబాధ లిన్నియుఁ బరిహరించె నీతని మూఁడడుగులే యీ లోకాలు యీతఁడే మూలమంటే నేతెంచి కరిఁ గా చె నీతనికంటే వేల్పు లిఁక మరి కలరా చ. యీతఁడే వైకుంఠనాథుఁ దీతఁడే రమానాథుఁ డీతఁడే వేదోక్తదైవ మిన్నిటాఁ దానె యీతఁడే అంతర్యామి యీ చరాచరములకు నీతఁడే శ్రీవేంకటేశుఁ డిహపరధనము రేకు:0241-02 సాళంగనాట సంపుటము: 03-234 పల్లవి: కంటిరా వో జనులాల కరుణానిధి యితఁడు జంట లక్షీదేవితోడ సరుస నున్నాఁడు చ. వాఁడివో ప్రతాపసుగ్రీవ నరసింహు డట్టె మూఁడుమూర్తు లొకరూపై ముంచివున్నాఁడు వేఁడి రక్కసులనెల్ల విదళించి వేసినాఁడు పాశీఁడిమి సురలఁ గాచీ భువనాధీశుఁడు చ. ఇరవైన రవిచంద్రు లితని కన్ను లివిగో ధరణి ననంతవేదము లూర్పులు అరుదై చెలఁగె బ్రహ్మాండ మీతని నెలవు నిరతి సనకాదులు నిత్యసేవకులు చ. ఘన మైన శంఖుచక్రములతో మెరసీని మనిపె ప్రపదుని మన్నించె నిదె యెనలేని శ్రీవేంకటేశుఁడై వున్నవాఁడు అనిశము సకలాంతరాత్మ తానైనాఁడు రేకు : 0096-03 ముఖారి సంపుటము: 01-479 పల్లవి: కంటే సులభ మిది కానక యుంటే దుర్లభః మింటిలోననే వున్న దిహముఁ బరమును చ. హరిదాసులు మెట్టినక్కడే పరమపదమరయ నిందుకంటె నవల లేదు